మిల్కీ బ్యూటీ తమన్నా అందానికి పడిపోని వాళ్ళు ఎవరైనా ఉంటారా. కానీ ఆ పాల బుగ్గల
సుందరి మాత్రం టాలీవుడ్ రౌడీ గ్లామర్‌కి పడిపోయింది. అంటేంటి అనుకుంటున్నారా అక్కినేని నాగార్జున ముద్దుల కోడలు సమంత ఈమద్యే ప్రారంభించిన ఆహాలో టెలికాస్ట్ అయ్యే సామ్ జాం అనే షోలో పలు మనసులోని మాటలను బహిరంగ పరచింది ఈ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నట్టు తెలిపింది.
సామ్ జామ్ షోలో సమంత తమన్నాను మీకు స్క్రీన్ మీద ముద్దు పెట్టె అవకాశం వస్తే ఎవరితో చేసేందుకు ఇష్టపడతారు అని అడగ్గా వెంటనే తనకు రౌడీ హీరో విజయ్‌తో చేస్తనని సూటిగా చెప్పింది. సమంత వెంటనే ఏజ్ గ్యాప్ వస్తాదేమో నేను అఖిల్‌ని ఆరెంజ్ చేస్తా అని చెప్పగా తాను వద్దు విజయ్ కావాలి అని చెప్పేసింది. తనకు ఎత్తైన ప్రదేశాలు అంటే భయమని కానీ ఎప్పుడు వెళ్తున్నాని, సినిమాల్లో తన పాత్రకు చిన్న ఫైట్స్ చేసే అవకాశం ఉంటె వనే చేస్తున్నట్టు తెలిపింది. అంతే తాను ఈమద్య కవయిత్రిగా మారిందని సమంత తెలుపగా దానికి తమన్నా హార్ట్ బ్రేక్ ఐతే అలానే మారాల్సి వస్తుందని, పూర్తి వివరాలు వెల్లడించనంది.
ఇక తమన్నా కెరీర్‌కు వస్తే కరోనా మహమ్మారి నుండి కోలుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సరసన సీటిమార్ చిత్రంలో నటిస్తుంది ఆ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది. కన్నడలో మంచి విజయం సాధించిన లవ్ మాక్ టైల్ రీమేక్ చిత్రంలో సత్యదేవ్ సరసన నటించనుంది ఈ పాల బుగ్గల సుందరి. ఆ చిత్రానికి గుర్తుందా శీతాకాలం అనే పేరును ఖరారు చేయగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పుత్రుడు కాలభైరవ సంగీతం అందించనున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!