Kavya kalyan ram: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. అల్లు అర్జున్ హీరోగా పరిచయం కాకముందు పలు సినిమాలలో సందడి చేశారు. అయితే అల్లు అర్జున్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన “గంగోత్రి” చిత్రం ద్వారా వెండితెరపై పరిచయమయ్యారు.
అప్పట్లో ఈ సినిమా ఎంతటి విజయాన్ని సృష్టించిందో అందరికీ తెలిసినదే. ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు వరుస సినిమాలు క్యూ కట్టాయి. అయితే గంగోత్రి సినిమా అంటే ఇప్పటికీ ఆ సినిమాలోని కొన్ని సీన్లు అందరికీ గుర్తుండే ఉంటాయి.
గంగోత్రి సినిమాలో చిన్నప్పటి గంగోత్రి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ రామ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ వస్తే కానీ అన్నం తినని, అల్లు అర్జున్ పాట పాడితే నిద్రపోయే కావ్య నటన అందరికీ ఎంతగానో గుర్తుండిపోయింది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతోమంది హీరోల సినిమాలలో నటించింది. చిరంజీవి ఠాగూర్, బాలకృష్ణ విజయేంద్ర వర్మ, పవన్ కళ్యాణ్ బాలు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు సంపాదించుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఏ విధంగా ఉందో షాక్ అవుతారు.
చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్:
అరడజనుకు పైగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య ప్రస్తుతం హాట్ హాట్ ఫోటోల ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు, మలయాళ సినిమాలలో ఆడిషన్స్ చేస్తూ సినిమాలలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేస్తూ ఎంతో మంది నెటిజన్లను ఫిదా చేస్తున్నారు.చిన్నప్పుడు తన ముద్దు ముద్దు మాటలతో అందరిని ఆకట్టుకున్న కావ్య త్వరలోనే హీరోయిన్ గా పరిచయం కానుంది చెప్పవచ్చు. చిన్నప్పుడు ఎంతో మందిని ఆకట్టుకున్న కావ్య ప్రస్తుతం ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!