Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా అల్లు అర్జున్ క్రేజ్ దేశ విదేశాలకు విస్తరించింది. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. పుష్ప విడుదల ఒక ముందు సౌత్ లో అత్యధిక మార్కెట్ కలిగిన తెలుగు హీరో. కానీ ఇప్పుడు పుష్పతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా తెలుసుకోవడం జరిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకుంటున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీ ఓ అరుదైన ఘనతను సాధించారు.
మేడమ్ టుస్సాడ్స్ దుబాయిలో మొదటి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ మైనపు బొమ్మను ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్ మ్యూజియంలో తొలి తెలుగు హీరో మైనపు బొమ్మ కలిగిన నటుడిగా బన్నీ చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉంటే తన చిన్నతనంలో టుస్సాడ్స్ మ్యూజియం సందర్శించినట్లు తెలిపారు. అయితే మ్యూజియంలో తన కొలతలకు వాళ్ళ టీం తన సగ్గరకి రావడం షాక్ గా ఉందని మీడియాతో తన ఆనందని పంచుకున్నారు. తన బొమ్మ టుస్సాడ్స్ ఏర్పాటు చేయటం అసలు ఊహించలేదని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ఈ మైనాపు బొమ్మ లో అల్లు అర్జున్ నలుపు రంగు సూట్ లో హుందాగా కనిపించబోతున్నారు.
దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ చేస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. పుష్ప మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధిక భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఒక్క ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో వారి భాషలోనే ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ఊహించని రేంజ్ లో విజయం సాధించడంతో సెకండ్ భాగం విషయంలో డైరెక్టర్ సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
National Award winner; the first Telugu Actor in 69 years to win this award and icon of dance moves, the one and only Allu Arjun is all set to come face to face with his wax twin at Madame Tussauds Dubai later this year.
Stay tuned for an event like never before 🎬✨#alluarjun pic.twitter.com/ePHhfvWfru
— Madame Tussauds Dubai (@Tussauds_Dubai) October 5, 2023
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!