టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ మోస్ట్ అందరి స్టార్ హీరో లను చుట్టేసిన అనుష్క ఒక్క “సైజ్ జీరో” సినిమా చేయడంతో ప్రస్తుతం కష్టాలు ఎదుర్కొంటున్నారు అన్న వార్త వైరల్ అవుతుంది. ఈ విషయం అనుష్క కూడా తన సన్నిహితుల దగ్గర అన్నట్లు టాక్ వస్తోంది. ఏకంగా ఈ సినిమాకోసం రిస్కు చేసి మరీ లావు పెరిగిన స్వీటీ..ఆ సినిమా హిట్ కాకపోవడంతో పాటు అవకాశాలు కూడా తగ్గిపోయాయని ప్రస్తుతం లబోదిబోమని బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా చేయడంతో కెరియర్ చాలావరకు డౌన్ అయిందని, అనవసరంగా “సైజ్ జీరో” సినిమా చేసినట్లు అనుష్క ప్రస్తుతం భావిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా మళ్లీ పూర్వవైభవం సాధించడానికి నిశబ్దంగా అనుష్క ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు టాక్. గత ఏడాది అక్టోబర్ రెండవ తారీకున “సైరా” సినిమా తో ప్రేక్షకులను పలకరించింది స్వీటీ. సాధారణంగా ఏడాదికి హీరోయిన్లు రెండు మూడు సినిమాలు చేస్తారు. కానీ అనుష్క మాత్రం చాలా కాలంగా నిశ్శబ్దం ప్రాజెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో “నిశ్శబ్దం” సినిమాతో కెరియర్ మళ్లీ గాడిలో పడుతుందని ఫుల్ నమ్మకం మీద ఉన్నారట. ఇప్పటికే చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉన్న కొద్ది లేట్ అయితే వయసు మీద పడే అవకాశం ఉండటంతో స్వీటీ “నిశ్శబ్దం” సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయినట్లు టాక్.
మొత్తం మీద చూసుకుంటే “సైజ్ జీరో” సినిమాతో తన కెరియర్ జీరో పొజిషన్ కి పడిపోయిందని అనుష్క భావిస్తున్నట్లు వార్తలు గట్టిగా మీడియా సర్కిల్ లో వినబడుతున్నాయి. గతంలో అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారు అనుష్క. ఆ జోనర్ అయితే హిట్ కన్ఫామ్. కానీ “నిశ్శబ్దం” ఇంకా డిఫరెంట్ జోనర్ అని దీంతో స్వీటీ అనుష్క ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకుంది. దీంతో బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టి అనేకమంది అభిమానం సంపాదించిన అనుష్క కి ఈ పరిస్థితి రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అంత గొప్ప హీరోయిన్ అనుష్క కి .. ఇన్ని కష్టాలా .. పాపం కదా అంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చాలామంది ఈ విధంగానే స్పందిస్తున్నారు. ఎలాగైనా స్వీటీ అనుష్క మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!