NBK108: నటసింహం నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK108” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ లీల బాలయ్య కూతురుగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు చలనచిత్ర రంగంలో మాస్ ఇమేజ్ అత్యధికం కలిగిన హీరోలలో బాలయ్య ఒకరిని అందరికీ తెలుసు. ఆ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ నేపథ్యంలో “భగవంత్ కేసరి” కథ డైరెక్టర్ అనిల్ రావిపూడి రాసుకోవడం జరిగిందట. ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయట.
ఎప్పటినుండో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో అభిమానులు రకరకాలుగా చర్చలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ జన్మదినోత్సవానికి రెండు రోజులు ముందుగానే…”భగవంత్ కేసరి” అనే టైటిల్ ప్రకటించడం జరిగింది. నేలలో దిగబడిన ఒక బలమైన ఆయుధాన్ని పైకి లాగుతూ బాలయ్య పోస్టర్..తో పాటు టైటిల్ ప్రకటించారు. దసరా పండుగకు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమానీ సాహు గారపాటి-హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య తీరు సినిమాలో ఉంటున్నా గాని అనిల్ రావిపూడి కామెడీ ఏమాత్రం మిస్ కాకుండా.. చాలా కామెడీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా “భగవంత్ కేసరి” నీ రూపొందిస్తున్నట్లు సమాచారం.
కుటుంబ సమేతంగా ప్రేక్షకులు చూసే మాదిరిగా.. సినిమా చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే “వీర సింహారెడ్డి” తో సంక్రాంతికి బాలకృష్ణ అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు దసరా పండుగకు “భగవంత్ కేసరి” ద్వారా ప్రేక్షకుల ముందుకు బాలయ్య రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. “భగవంత్ కేసరి” కంప్లీట్ అయిన వెంటనే బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో నాలుగో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ టైటిల్ విని నందమూరి ఫ్యాన్స్ అదరగొట్టింది టైటిల్.. బాలయ్య ఇమేజ్ కి తగ్గ రీతిలో ఉంది అంటూ.. టైటిల్ అదుర్స్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!