Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా .. “మిషన్ ఇంపాజిబుల్” తాను చూసినట్లు.. చాలా బాగుంది అని తెలియజేశారు. ఇక తాప్సీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. ఈ సినిమాలో అద్భుతంగా నటించిందని తెలియజేశారు. అంతకుముందు తాప్సీ నటించిన పింక్, బద్లా… సినిమాలు చూడటం జరిగిందని ముఖ్యంగా ఆమె ఎంట్రీ ఇచ్చిన ఝుమ్మంది నాదం సినిమా చూసి ఎంతో క్యూట్ గా ఉంది అని అప్పట్లోనే అనిపించిందని కానీ రాజకీయాల్లో కి వెళ్ళటం వల్ల తాప్సీని మిస్ అయ్యాను అంటూ చిరంజీవి వైరల్ కామెంట్లో చేశారు.
“ఝుమ్మందినాదం” లో ఉన్న తాప్సీకి ప్రస్తుతం ఆమె చేస్తున్న పాత్రలకు చాలా వ్యత్యాసం ఉందని… పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఒక్కోసారి ఇటువంటి అందగత్తెల ని చూసినప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా? అనిపిస్తుంది అంటూ చిరు తనదైన శైలిలో కామెడీ చేశారు. తాప్సీ తో సినిమా చేసే అవకాశం యువ దర్శకులకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక ఇదే ఫంక్షన్ కి చాలా మంది ఎం డైరెక్టర్లు “కలర్ ఫోటో” డైరెక్టర్… ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ.. ఇంకా చాలామంది కుర్ర దర్శకుల్లో రావటం వాళ్ళంతా చిరంజీవి అభిమానులు… అనటం తో.. స్టేజీపై మా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది అంటూ చిరంజీవి చాలా ఉత్సాహంగా స్పీచ్ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలా మంది హాజరయ్యారు. ఇక ఇదే సమయంలో వేడుకకు హాజరైన కుర్ర దర్శకులకు చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాప్సీ తో ఒక సినిమా చేసే అవకాశాన్ని యంగ్ డైరెక్టర్లకు ఇస్తున్నానని.. చిరంజీవి పేర్కొన్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!