Bhola shankar: టాలీవుడ్లో ఉన్న బడా నిర్మాణ సంస్థలలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. ఇప్పటి వరకు ఈ సంస్థలో ఇతర నిర్మాణ సంస్థలు కలిసి సినిమాలు నిర్మించాయి. కానీ, మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సోలోగా సాలీడ్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెట్టారు ఈ సంస్థ అధినేత అనిల్ సుంకర. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది.
తమిళంలో భారీ హిట్ అందుకున్న వేదాళం చిత్రానికి అఫీషియల్ తెలుగు రీమేక్‌గా భోళా శంకర్ నిర్మితమవుతోంది. మెహర్ రమేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర భారీ బడ్జెట్తీ నిర్మిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో చిరంజీవికి జంటగా నటిస్తోంది. మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సాంగ్, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ అయింది.
Bhola shankar: ఈ ఏడాది సమ్మర్లోనే భోళా శంకర్..?
ప్రస్తుతం టాకీ పార్ట్ జరుగుతోంది. ఇదే నిర్మాత అఖిల్ అక్కినేనితోనూ ఏజెంట్ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు భోళా శంకర్ సినిమా పూర్తయ్యేవరకు మరో కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం లేదని నిర్మాత అనిల్ సుంకర చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే ఈ ఏడాది సమ్మర్లోనే భోళా శంకర్ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!