Project K: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తేరకెక్కుతున్న “ప్రాజెక్టుకే” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ బ్యానర్ లో 50వ సినిమా కావటంతో నిర్మాత అశ్విని దత్ ఈ ప్రాజెక్టుని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ప్రభాస్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా. సూపర్ హీరోస్ తరహాలో ఈ సినిమా స్టోరీ ఉన్నట్లు వార్తలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ టెక్నాలజీతో హాలీవుడ్ హై క్వాలిటీ కెమెరాలతో… సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే తాజాగా షూటింగ్ జరుగుతున్న సమయంలో అమితాబ్ గాయపడ్డారట. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన పక్కటెముకులకు గాయాలు అయ్యాయట. దీంతో వెంటనే హైదరాబాద్ లో ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స చేయడం జరిగిందట. ఆ వెంటనే బొంబాయి లో తన నివాసానికి వెళ్ళిపోయి అమితాబ్ రెస్ట్ తీసుకుంటున్నారట. పెద్ద ప్రమాదమేమీ లేదని.. కానీ వయసు మీద పడటంతో కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అమితాబ్ తో పాటు హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇండియాలో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని జోనర్ నీ ఈ సినిమా ద్వారా దర్శకుడు అశ్విని దత్ పరిచయం చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజువల్ గ్రాఫిక్స్ వర్క్ కీ పెద్ద పేట వేసే తరహాలో యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు సమాచారం.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!