Buchibabu – NTR: బుచ్చిబాబు కల నెరవాలంటే అది అల్లు అర్జున్ వల్లే సాధ్యం..కానీ, క్రెడిట్ మాత్రం ఎన్టీఆర్ ఖాతాలో పడుతుంది..! అవును మీరు చూస్తుంది నిజమే. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో సంచలనం సృష్టించాడు దర్శకుడు బుచ్చిబాబు. సుకుమార్ అసోసియేట్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి పేరు క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో వరుసగా అవకాశాలు అందుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ, ఎందుకనో బుచ్చిబాబు చాలా స్లోగా జాగ్రత్తగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకుంటున్నాడు. ముందు నుంచి బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్‌తోనే అని ప్రచారం అవుతోంది.
బుచ్చిబాబు కూడా అదే ప్రయత్నాలను గట్టిగా చేస్తున్నాడు. మధ్యలో తను అక్కినేని హీరోలతో సినిమా చేయనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్యతో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఉందని ఆ తర్వాత అఖిల్‌తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, అఫీషీయల్‌గా మాత్రం వీరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. అయితే, తాజాగా బుచ్చిబాబు గత ఏడాది నుంచి వెయిట్ చేస్తున్న ఎన్.టి.ఆర్ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అయిందని సమాచారం. వేరే హీరోలతో కమిటవకుండా బుచ్చిబాబు ఎదురూస్తుంది తారక్ కోసమే. ఆయన మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్, దీని తర్వాత కొరటాల శివ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Buchibabu – NTR: తారక్‌తో బుచ్చిబాబు ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం.
అంతేకదు, కొరటాల శివ సినిమా తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలుంటాయని అప్పటి వరకు బుచ్చిబాబుది వెయిటింగ్ లిస్ట్ అని అనుకున్నారు. కానీ, అట్లీ నెక్స్ట్ సినిమాను బన్నీతో చేయనున్నాడట. దాంతో కొరటాల సినిమా మొదలైన కొన్నాళ్ళకు బుచ్చిబాబు సినిమాను తారక్ సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు ఓకే చెప్పారట. దాంతో అల్లు అర్జున్ బుచ్చిబాబు కల నెరవేర్చబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక బుచ్చిబాబు ఎన్.టి.ఆర్తో సినిమా తీసి భారీ హిట్ ఇస్తే మాత్రం సెకండ్ సినిమాకు అవకాశం ఇచ్చిన హీరోగా క్రెడిట్ ఆయన ఖాతాలోకి వెళుతుందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా బన్నీ అట్లీ సినిమాను చేస్తే తారక్‌తో బుచ్చిబాబు ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!