కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ఇటు దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. దక్షిణాది ఏంటి? ఆయన బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన కొన్ని కారణాల రీత్యా సమస్యల్లో చిక్కుకున్నాడు. సుదీప్ సినిమాలతో పాటు కిచ్చా క్రియేషన్స్ పేరుపై సీరియల్స్ కూడా నిర్మిస్తుంటాడు. అందులో భాగంగా చిక్ మంగళూరుకి చెందిన మయూరు వ్యాపారి, తోటను షూటింగ్ నిమిత్తం అద్దెకు తీసుకుని షూటింగ్ చేసుకున్నారు. అయితే ఈ షూటింగ్లో తన ఇల్లు, తోటను నాశనం చేశారని సదరు వ్యాపారి మయూరు ఆరోపణలు చేసి కోటిన్నర రూపాయలను చెల్లించమని అడిగినా సుదీప్ నిర్మాణ సంస్థ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. మయూరు కోర్టుకెక్కాడు. కోర్టు కేసులో కూడా కిచ్చా సుదీప్ వాదనలకు హాజరు కాలేదు. కోర్టుకి హాజరు కావాలని పంపిన నోటీసులకు బదులు లేదు. దాంతో కోర్టుకి ఆగ్రహం వచ్చింది. సుదీప్‌కు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. మరిప్పుడు సుదీప్ ఏం చేస్తాడో చూద్దాం.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!