Dum Masala: ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన పెద్ద సినిమా “గుంటూరు కారం”. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. జనవరి 12వ తారీకు విడుదలైన ఈ సినిమా పండగ రోజుల వరకు కలెక్షన్ల సునామీ సృష్టించింది. కానీ సినిమా పరంగా విషయం లేకపోవడంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దర్శకుడు త్రివిక్రమ్ పనితనం సినిమాలో ఎక్కడా కనిపించలేదని ఆడియన్స్ కామెంట్స్ చేయడం జరిగింది.
ఈ సినిమాలో మహేష్ బాబు డాన్స్ తో పాటు శ్రీ లీల పెర్ఫార్మన్స్ మాత్రమే ఆడియన్స్ ని అలరించాయి. తల్లి కొడుకు సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా బోల్తా పడింది. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు కూడా ఎక్కడా కనిపించలేదు. సో 12 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన “గుంటూరు కారం” అభిమానులను చాలా డిసప్పాయింట్ చేసింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ అందరినీ ఆకట్టుకోవడం తెలిసిందే. మొదటి సాంగ్ గా విడుదలైన “దమ్ మసాలా” అందరినీ అలరించడం జరిగింది.
ఆ తర్వాత విడుదలైన అన్ని సాంగ్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి. కుర్చీ మడత పెట్టి, ఓ బేబీ సాంగ్స్ విపరీతంగా సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే “దమ్ మసాలా”.. ఫుల్ వీడియో సాంగ్ తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుండి అమ్మ అనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో సాంగ్ కింద “దమ్ మసాలా” రిలీజ్ చేశారు. త్వరలోనే ఫిబ్రవరి మూడో వారంలో “గుంటూరు కారం” ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ తన తదుపరి సినిమా రాజమౌళి ప్రాజెక్టుపై ఫుల్ బిజీగా ఉన్నారు.