NTR: యంగ్ టైగర్ NTR గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. తెలుగునాట అత్యధిక ఫ్యాన్ బేస్ వున్న నటులలో ఆయన ఒకడు. కాగా ప్రస్తుతం అతను కొరటాల శివ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కాంబినేషన్ అనుకున్నప్పటినుండే ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ వస్తుందనే నమ్మకం తో నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ నమ్మకంను వమ్ము చేయవద్దనే పట్టుదలతో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో చాలా శ్రద్దగా ఉన్నాడని తెలుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
NTR లుక్ ఆ విధంగా ఉండబోతుంది!
ఇకపోతే, నందమూరి అభిమానులకు కిక్కిచ్చే వార్త బయట వినబడుతోంది. NTR లుక్ విషయంలో కొరటాల శివ చాలా పట్టుదలతో ఉన్నాడనే వార్తలు టాలీవుడ్లో వినబడుతున్నాయి. ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో NTR కాస్త ఓవర్ వెయిట్ తోనే కనిపించాడు. అయితే వీరి కాంబోలో రాబోతున్న తాజా సినిమాలో మాత్రం NTR లుక్ చాలా విభిన్నంగా ఉంటుందని గుసగుసలు వినబడుతున్నాయి. చిన్న వాడిగా, మధ్య వయస్కుడిగా ఈ సినిమాలో NTRను చూపించడం కోసం కాస్త సన్నగా మారాలని కొరటాల శివ సూచించాడని సమాచారం. గతంలో ఎన్టీఆర్ యమదొంగ మరియు కంత్రి సినిమాలో చాలా సన్నగా కనిపించిన విషయం తెల్సిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
మరింత సమాచారం:
NTRను ఈమద్య కాలంలో చాలా రెగ్యులర్ గా అంటే ప్రతి సినిమాలో కూడా ఒకేరకమైన ఫిజిక్ తో చూస్తున్నాం. ఈసారి కొరటాల శివ కాస్త సన్నగా NTRను చూపించనున్నారు. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇక కొరటాల శివ తాజా చిత్రం ఆచార్య తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితం ఇప్పుడు NTR 30పై ఖచ్చితంగా పడుతుంది. కనుక అభిమానులు చాలా ఆసక్తిగా NTR 30 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్న విషయం గురించి అందరికీ తెల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!