Valari movie trailer: యువ నటి రితికా సింగ్ మరియు నటుడు శ్రీకాంత్ ముఖ్య పాత్రలలో మ్రితికా సంతోషిణి దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ హర్రర్ మూవీ ” వళరి “. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ యొక్క థియేటర్ ట్రైలర్ ని నిన్న అనగా ఫిబ్రవరి 29న సాయంత్రం విడుదల చేశారు మేకర్స్. హైదరాబాదులో ఓ ఈవెంట్ కూడా ఏర్పరిచారు.
ప్రస్తుతం ఈ ట్రైలర్ youtube లో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ మూవీ ఈవెంట్ కి మాస్ కమర్షియల్ దర్శకుడు హరీష్ శంకర్ హాజరవ్వడంతో ఈ సినిమాపై మరింత దృష్టి మళ్లింది. యాక్షన్ ట్రైలర్ తో సాగే ఈ మూవీ యొక్క కథాంశం కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా హర్రర్ మూవీస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేవిధంగా నేటి తరంలో హరర్ మూవీలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.
ముఖ్యంగా ట్రైలర్లో థ్రిల్లర్ మరియు హర్రర్ సన్నివేశాలు ఎంతో బాగా అలరించాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కి గూస్బంస్ వచ్చాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో సుబ్బరాజు, ప్రిన్సెస్ సహారా వంటి వారు ముఖ్య పాత్రలు వహిస్తున్నారు. కె. సత్య సాయి బాబు ఎగ్జిగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక ఈ మూవీని ప్రముఖ ఓటిటి సమస్త ఈటీవీ విన్ వారు మార్చ్ 8 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్లో టాప్ లో ట్రెండ్ అవుతుంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!