Intinti Gruhalakshmi: ప్రేమ్ వాళ్ళ ఇంటికి తులసి వస్తుంది.. వాళ్ళమ్మ రాగానే ప్రేమ్ పరిగెత్తుకుంటూ వెళ్లి వీళ్ళంతా నన్ను మోసం చేశారు అమ్మ.. నీకు చెప్పి ఇక్కడికి వచ్చాము అని చెప్పారు గానీ.. స్వయంగా నువ్వు ఎక్కడికి వస్తున్నావ్ అని చెప్పకుండా నన్ను మోసం చేశారు అమ్మ అని అంటాడు ప్రేమ్..!!
వాళ్ళు మోసం చేసింది నిన్ను కాదు నన్ను నా ప్రేమని అని తులసి అంటుంది. వీళ్లంతా నీమీద బెంగతో హోలీ జరుపుకోవడానికి కూడా ఇష్టపడకపోతే.. ఈ ఒక్క రోజైనా నిన్ను ఇంటికి తీసుకువచ్చి అందరితో సంతోషంగా గడపాలని.. నిన్ను నేను ఇంటికి తీసుకువెళ్లాలని ఇక్కడికి వచ్చాను. నా కళ్లలో కారం కొట్టి నీ దగ్గరకు వచ్చి ఇక్కడ నీతో ఉంటారని కలలో కూడా ఊహించలేదు అని తులసి అంటుంది. దగ్గరగా ఉండి వాళ్లు నన్ను మోసం చేస్తుంటే.. దూరంగా ఉండి ఆటో నడుపుతూ నన్ను కూడా నువ్వు మోసం చేసావు. ఈ అమ్మ కి ఇచ్చిన మాటని.. నీ ఆశయాన్ని గాలికి వదిలేసి బ్రతికేస్తున్నావు. నీ జీవితం గురించి నిన్ను అడిగే హక్కు నాకు లేదా.. ఇంట్లో నుంచి పంపించేస్తే నేను నేను నీ గురించి అడగకూడదు అనుకుంటున్నావా.. అలా అనుకుంటే ఇప్పుడే చెప్పు నాకు ఒక్కడే కొడుకు అనుకోని నా మనసు చంపుకొని వెళ్ళిపోతాను అని అంటుంది. తులసి మాటలతో మనసు ముక్కలు చేస్తుంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.
తులసి ఇంటికి వచ్చే బాధపడుతూ ప్రేమ్ మనసు విరిగిపోయేలా మాట్లాడాను మావయ్య. తన కడుపులో కత్తులు దించెలా మాట్లాడా.. తన కంటి నుంచి రక్తం కారుతోంది. ఈ కఠినమైన అమ్మ మనసు తో వాడి మనసు ముక్కలు చేశాను అని బాధపడుతుంది. అంతలో నందు వచ్చి ఈ ఇంట్లో మనుషులతో మాట్లాడాలి అంటే పర్మిషన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇందాక అర్జంటుగా ఏదో పని ఉండి బయటకు వెళ్తున్నాను అని చెప్పను. ఇప్పుడు చెప్పండి మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు అని అంటుంది తులసి. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని అనుకుంటున్నాను. ఈ ఇంట్లో నాకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు నా పిల్లలు నా నుంచి దూరం చేసినపుడు నేను ఎందుకు ఇంట్లో ఉండటం అని నందు అంటాడు. నందు తో తన అమ్మనాన్నలను తీసుకువెళ్ళడానికి తులసి నీ ఒప్పించమని అడుగుతాడు. ఇక తులసి ఎలా ఒప్పిస్తుందో.. ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!