సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఉంటుందని దిగ్గజ దర్శకుడు రాజమౌళి లాక్డౌన్ సమయంలో కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. గతంలో రాజమౌళి తో “సింహాద్రి” సినిమా ని నిర్మించిన తరుణంలో నెక్స్ట్ సినిమాకి కె.ఎల్.నారాయణ అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు రాజమౌళి మళ్లీ ఈ బ్యానర్లో సినిమా చేయలేదు.
ఇటువంటి తరుణంలో మహేష్ సినిమాని ఈ బ్యానర్ లో చేయడానికి నారాయణ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ని రాజమౌళి రాజమౌళి ఈ విధంగా సెట్ చేశారట. అలా అనుకోకుండా ఈ ప్రాజెక్టు సెట్ అయిందట. ఇదిలా ఉంటే ఈ సినిమా చేయటానికి రాజమౌళి రెడీ అవుతుంటే మధ్యలో బాలీవుడ్ స్టార్ హీరో అడ్డు పడుతున్నట్లు గుసగుసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే రాజమౌళి ప్రస్తుతం “RRR” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అయిన వెంటనే మహేష్ తో చేయాలనుకుంటే….మధ్యలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో, లేదు తనతోనే సినిమా మొదలుపెట్టాలని రాజమౌళి పై ఒత్తిడి తీసుకువస్తున్నారట. దీంతో రాజమౌళి మహేష్ సినిమా ఇప్పుడప్పుడే ఉండదని వార్తలు వస్తున్నాయి. మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని రాజమౌళి ఎప్పటినుండో అనుకుంటున్నారు. అయితే తాజాగా మాత్రం ఆ బాలీవుడ్ హీరో అమీర్ ఖానే అని చాలామంది భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో అయ్యో అసలు కారణం ఇదా..? మా హీరో తో రాజమౌళి అందుకే ఆలస్యం చేయబోతున్నారా అంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారట.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!