బుల్లితెరపై గత ఆరేళ్లుగా ప్రతి టీవీ అభిమానిని మెప్పిస్తున్న ప్రోగ్రామ్ ‘జబర్దస్త్’. రోజా,నాగబాబు జడ్జీలుగా రష్మీ-అనసూయ హోస్టులుగా… మల్లెమాల ప్రొడక్షన్స్ లో వస్తున్న ఈ తెలుగు స్టాండ్ అప్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.
సుడిగాలి సుధీర్ నుంచి చమ్మక్ చంద్రా వరకూ ఒక్కో టీం లీడర్ ది ఒక్కో స్టైల్ అయితే జబర్దస్త్ మొదట్లో అదిరే అభి టీంలో మెంబర్ గా చేసి ఇప్పుడు టీం లీడర్ గా మారిన హైపర్ ఆదిది మరో స్టైల్. ఊపిరి కూడా తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా పంచులు వేయడంలో దిట్ట అయిన ఆదికి, అతని టీం ప్రధాన బలం. వీరిలో రైజింగ్ రాజు, దొరబాబులు… ఆది స్కిట్ ని ముందుడి నడిపిస్తారు.
ముఖ్యంగా హైపర్ ఆది, దొరబాబుపై వేసే పంచులకి ప్రతి బుల్లితెర అభిమాని నవ్వుతూనే ఉంటాడు. ఒకప్పుడు బీ గ్రేడ్ సినిమాలో నటించిన దొరబాబు, అటు నుంచి జబర్దస్త్ వైపు వచ్చి, ఆది టీంలో సెట్ అయిపోయాడు. ఇప్పుడు దొరబాబు అంటే తెలియని జబర్దస్త్ అభిమాని లేడు, అంతలా పెరు తెచ్చుకున్న దొరబాబుకి పెళ్లి అయ్యిందని చాలా మందికి తెలియదు.
నెల్లూరులోని ఒక లోకల్ ఛానెల్ లో యాంకర్ గా వర్క్ చేసే నందిని అనే అమ్మాయిని గతేడాది మార్చ్ 4న దొరబాబు పెళ్లి చేసుకున్నాడు. దొరబాబు, నందినీలకి ఇప్పుడు ఒక బాబు పుట్టాడు. దొరబాబు టీం లీడర్ హైపర్ ఆది, దొరబాబు కొడుకుని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో… జబర్దస్త్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దొరబాబు-నండినీలకి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక జబర్దస్త్ జడ్జీలు ఉన్న నాగబాబు, రోజా కూడా దొరబాబు కొడుకుని చూసి ఆశీర్వదించారని తెలుస్తోంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!