తమిళనాడు రాజకీయాల్లో ఎ.ఐ.డి.ఎం.కె అధినేత్రి జయలలిత ప్రస్థానం తిరుగులేనిది. ఈ దివంగత ముఖ్యమంత్రి జీవిత కథను `తలైవి` అనే సినిమాగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ తార కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్` బాటలోనే `తలైవి` చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రూపొందించనున్నారు. తొలి పార్ట్‌లో జయలలిత బాల్యం నుండి సినిమా హీరోయిన్గా ఆమె రాణించిన క్రమాన్ని చూపిస్తారట. ఇక రెండో పార్ట్‌లో జయలలిత రాజకీయాల్లో ఆటు పోటులను దాటి ముఖ్యమంత్రిగా ఎలా రాణించారో అనే దాన్ని చూపిస్తారట.
జయలలిత పాత్ర కోసం కంగనా అన్నీ రకాలుగా సిద్ధమవుతున్నారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి ఈ సినిమాను నిర్మించనున్నారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
previous post
next post
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!