మహానటితో జాతీయ ఉత్తమనటి అవార్డు సొంతం చేసుకున్న కీర్తిసురేష్… ఇప్పుడు ఆచితూచి స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటూ సాగుతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో దక్షిణాది సినిమాలే కాదు..ఉత్తరాది సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్సే అధికంగా ఉన్నాయి. ఇందులో నరేంద్ర దర్శకత్వంలో `మిస్ ఇండియా` అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా కోసం కీర్తి చాలా బరువు తగ్గింది. ఈమె సినిమాలో నాలుగు లుక్స్‌లో కనపడుతుంది. ఈ నాలుగు లుక్స్ కోసం కీర్తి 50 లుక్ టెస్ట్‌లు చేసిందట. మరి ఈ చిత్రం కీర్తికి ఎలాంటి పేరుని తెచ్చి పెడుతుందో చూడాలి.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!