RRR: RRR ఎట్టకేలకు తెరపైకి వచ్చి ప్రేక్షకులని అలరిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి ఈరోజే వచ్చింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అన్ని చోట్ల థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. అవును… నేడు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం నడుస్తోంది. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఇటీవల పాల్గొనడం అందరికీ తెలిసినదే. అయితే ఇప్పుడు సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూస్తే వాళ్ళు పడిన కష్టానికి ఫలితం దక్కినట్టే కనబడుతోంది.
RRR: `ఆర్ఆర్ఆర్`పై చిరంజీవి రివ్యూ.. నెట్టింట ట్వీట్ వైరల్!
RRR: ఎన్టీఆర్ సేఫ్ జోన్!
అవును, సినిమా రిలీజ్ అవడంతో ఇపుడు ఎన్టీఆర్ ఊపిరి పీల్చుకుంటున్నాడు. పెద్ద స్టార్ అయినప్పటికీ సినిమా విడుదలై, రెస్పాన్స్ వచ్చే వరకూ కాస్త టెన్షన్ గానే ఉంటుంది. కానీ పాజిటివ్ టాక్ రావడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు బిగ్ రిలీఫ్ దక్కినట్టే. ముఖ్యంగా ఎన్టీఆర్ కు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడానికి కాస్త గ్యాప్ దొరికినట్టే! కానీ రామ్ చరణ్ పరిస్థితే ఒకింత బాధాకరంగా వుంది.
RRR: `ఆర్ఆర్ఆర్`పై చిరంజీవి రివ్యూ.. నెట్టింట ట్వీట్ వైరల్!
మరి రామ్ చరణ్ పరిస్థితి?
చరణ్ కి ఇప్పుడున్న టెన్షన్ అలా కంటిన్యూ అవ్వక తప్పదు… ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ టెన్షన్ తప్పినప్పటికీ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ “ఆర్సీ 15” షూటింగ్ లో పాల్గొనాలి. ఒక్క ఈ సినిమానే కాదు… ఏప్రిల్ 29న మెగాస్టార్ “ఆచార్య” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక త్వరలో ప్రారంభం కానున్న “ఆచార్య” హంగామాలో, ప్రమోషన్స్‌లో చరణ్ ముందుండాలి. చెర్రీ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించడమే కాకుండా నిర్మిస్తున్నాడు కూడా. ఇన్ని పనులు ఉంటే చెర్రీకి విశ్రాంతి తీసుకునే సమయం ఎక్కడ ఉంటుంది మరి?
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!