Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా విజయం తర్వాత సరైన హిట్ లేక బాలయ్య బాబు అభిమానులు ఎంతగానో నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్ కి సంబంధించిన రెండు సినిమాలు సరిగ్గా ఎలక్షన్ సమయంలో అట్టర్ ఫ్లాప్ అవ్వడం… అభిమానులను ఎంతగానో నిరుత్సాహం కలిగించాయి. ఇలాంటి తరుణంలో గతంలో రెండు మర్చిపోలేని హిట్లు ఇచ్చిన బోయపాటితో ప్రస్తుతం బాలయ్య బాబు “అఖండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో బాలయ్య బాబు కి హిట్టు పడాలని… బోయపాటి తో హ్యాట్రిక్ నమోదు కావాలని… ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోపక్క బోయపాటి కూడా అఖండ సినిమా సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ టైములో చాలా జాగ్రత్త తీసుకోవడం జరిగిందట. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి సన్నివేశం అభిమానులను అలరించే రీతిలో ప్లాన్ చేసుకుని మరీ బోయపాటి చిత్రీకరించడం జరిగిందట. ముఖ్యంగా “అఖండ” ఇంటర్వెల్ బ్యాంగ్ “లెజెండ్” సినిమా మాదిరిగా… ఫైట్ లో అదిరిపోయే డైలాగులు బాలకృష్ణ నోటి చేత బోయపాటి పలికించ బోతున్నడట.
టోటల్ గా చూసుకుంటే మరోసారి లెజెండ్ . ఇంటర్వెల్… మాధురి సన్నివేశాలు “అఖండ” లో రిపీట్ చేసే ఆలోచనలో బోయపాటి వున్నట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలావుంటే ఇటీవల అఖండ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో అనేక రికార్డు సృష్టించడంతో తాజా వార్తతో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ మరింత అంచనాలు పెట్టుకున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!