టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేశ్ బాబు ఒకరు. కృష్ణగారి అబ్బాయి నుంచి ప్రిన్స్ మహేశ్.. అక్కడి నుంచి సూపర్ స్టార్ మహేశ్ గా ఎదిగాడు. మహేశ్ కు యూత్ లోనూ, ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్టే ఆయన సినిమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. సినిమా హీరోగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు మహేశ్. దీంతో ఆయన యాక్టివిటీస్ అన్నీ సోషల్ మీడియాలో అప్డేట్స్ చేస్తూంటాడు. ప్రస్తుతం ఇదే సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసేలా చేసింది. సౌత్ ఇండియాలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ప్రస్తుతం అంతా సోషల్ మీడియా హవానే నడుస్తోంది. ఒక చిన్న మెసేజ్ చేస్తే చాలు.. క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇందుకు వేదికగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్.. వంటి మాధ్యమాలు వచ్చేశాయి. వీటిలో ఒక సెలబ్రిటీకి ఎంతమంది ఫాలోయర్స్ ఉంటే అంత గొప్ప. ప్రస్తుతం మహేశ్ ట్విట్టర్లో అదే సాధించాడు. ఏకంగా 11 మిలియన్ ఫాలోవర్స్ తో సౌత్ ఇండియా రికార్డు సాధించాడు. ఈస్థాయి ఫాలోవర్స్ సౌత్ ఇండియాలో మరే హీరోకి లేకపోవడం విశేషం. దీంతో ట్విట్టర్ లో సౌత్ ఇండియా నెంబర్ వన్ గా నిలిచి దూకుడులోని.. ఆల్ టైమ్ రికార్డ్ అనే పేమస్ డైలాగ్ ను నిజం చేశాడు.
దీంతో మహేశ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. తన ఫిలిం అప్డేట్స్, బర్త్ డే విశెష్, ఫ్యామిలీ పిక్స్, వెకేషన్ ట్రిప్స్.. ఫొటోలు అప్డేట్ చేయడం, తన కుటుంబంతో ఉన్న బాండింగ్, పిల్లలు గౌతమ్, సితారతో ఆటలు, ఫన్.. ఇలా దాదాపు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూంటాడు. దీంతో మహేశ్ కు ఫాలోవర్స్ పెరిగారు. ట్విట్టర్ మాత్రమే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో మహేశ్ కు 6.1 మిలియన్ ఫాలోవర్స్, ఫేస్ బుక్ లో 5.8 ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో #11millionmaheshians అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!