కొన్ని కాంబినేషన్లలో సినిమాలు అనౌన్స్ అయిన నాటి నుంచీ భారీ అంచనాలు నెలకొంటాయి. ఫ్యాన్స్ ఆశలు ఆకాశంలో ఉంటాయి. తమ హీరో మ్యాజిక్ చేయబోతున్నాడని, కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం అంటూ అంచనాలతో ధియేటర్లకు వస్తారు. అయితే.. వారి ఆశలకు తగ్గట్టు సినిమా ఉండదు. కానీ.. సినిమాలో మంచి విషయం, హీరో ఎలివేషన్, కథ, కథనం ఇవేమీ వారికి కనిపించవు. వారి అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉండదు. ఇవే కొన్ని సినిమాలకు శాపంగా మారతాయి. అటువంటి కోవలోకి వచ్చే సినిమా మహేశ్ ‘ఖలేజా’. విపరీతమైన అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన ఈ సినిమా విడుదలై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి.
ఖలేజాలో ఫ్యాన్స్ ఆశించింది వేరు.. సినిమాలో ఉన్నది వేరు. హీరోయిజం చూపిస్తాడనుకున్నారు.. దేవుడ్ని చేశారు. ‘సామీ.. నువ్వు శిఖరం’ అంటే వాళ్లకు నచ్చలేదు. మహేశ్ నుంచి అంతకుమించి ఆశించారు. దీంతో మంచి సినిమా కాస్తా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. కథగా చిన్న పాయింటే అయినా కథనంతో త్రివిక్రమ్ సినిమాను నడిపించిన విధానం హైలైట్. త్రివిక్రమ్ మార్క్ లెవల్లో ఉంటుంది. మహేశ్ లోని కామెడీ, యాక్షన్, నటన అన్నింటినీ సమపాళ్లలో ప్రెజెంట్ చేశాడు. అంతటి స్కోప్ ఉన్న సినిమా ఖలేజా. మనిషిలోనే దైవాన్ని చూడాలి.. అనే కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ అద్భుతమే చేశాడు. సినిమాలో యాక్షన్ మోడ్ హై ఎండ్ లో ఉంటుంది.
త్రివిక్రమ్ డైలాగ్స్, టేకింగ్, స్క్రీన్ ప్లే, మణిశర్మ సంగీతం.. ఇలా ప్రతి విభాగం సినిమాను హై ఎండ్ లో ప్రెజెంట్ చేశాయి. కానీ.. కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. మంచి సినిమాగా నిలిచిపోయింది. అందుకే మహేశ్ కూడా ఈ సినిమా అంటే తనకెంత ఇష్టమో ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. ‘నటనకు అవకాశమున్న పాత్ర ఇది. నాలోని నటనను వెలికితీసిన సినిమా ఇది. త్రివిక్రమ్ గారితో మరో సినిమా చేసేందుకు ఎదురు చూస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. నిజంగానే మహేశ్ కెరీర్లో ఇదో ‘ఖలేజా’ ఓ అద్భుతం అని చెప్పాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!