సూపర్‌స్టార్ మహేష్ తన అభిమాని కోసం ఓ పని చేసి ఆమె సంతోషానికి కారణమయ్యారు. ఇంతకు మహేష్ చేసిన పనేంటి? అనే వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్వీన్ బిబి అనే చిన్నారికి క్యాన్సర్ సోకింది. ఈమెకు సూపర్‌స్టార్ మహేష్ అంటే చాలా ఇష్టం. ఆమె మహేష్‌ను చూడాలని ఇష్టపడింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమాని కోసం స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లారు… పరామర్శించారు. పర్విన్తో కాసేపు గడిపిన మహేష్.. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అభిమాని కోసం వచ్చిన మహేష్‌ను చూసిన చిన్నారి ఆనందానికి అవధులు లేవు. మహేష్ మంచి మనసును అందరూ మెచ్చుకుంటున్నారు. పర్విన్ను మహేష్ కలిసిన ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.
previous post
next post