సాధారణంగా సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే సూపర్‌స్టార్ మహేష్ ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోవడం లేదు. ఇమీడియట్గా కొత్త సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. తదుపరి అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనీల్ రావిపూడి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఏప్రిల్ 25న `మహర్షి` విడుదలవుతుంది. తర్వాత మహేష్ సమ్మర్ హాలీడేస్‌కు ఏదో ఒక దేశం ఫ్యామిలీతో సహా వెళ్లనున్నాడు. మే లేదా జూన్‌లో మహేష్ తిరిగి రాగానే, జూలైలో సినిమాను స్టార్ట్ చేస్తాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. అనీల్ సుంకర నిర్మించబోయే ఈ సినిమాకు మహేష్ స్వంత నిర్మాణ సంస్త జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలోభాగస్వామి కానుంది. `దూకుడు` సీక్వెల్ అని వినపడుతున్న ఈ చిత్రానికి `వాట్సాప్` అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!