NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili February 17 2024 Episode 575: వసుంధర కి విషం ఇచ్చి చచ్చిపో అంటున్న మల్లి, మల్లి మీద చేయి చేసుకున్న మాలిని..

Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights

Malli Nindu Jabili February 17 2024 Episode 575:  గౌతమ్ నిద్రపోతున్నది చూసి మల్లి వసుంధర వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గౌతమ్ లేసి చూసేసరికి మల్లి అక్కడ కనిపించదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని గౌతమ్ ఆలోచిస్తూ కిందికి వస్తాడు. గౌతమ్ మల్లి నీ ఇంత పొద్దున్నే ఎక్కడికి పంపించావు రా అని కౌసల్య అడుగుతుంది. నేనెక్కడికి పంపించలేదమ్మా అని గౌతమ్ అంటాడు. చూశావా నువ్వు ఇచ్చిన చనువు వల్ల అది నెత్తికెక్కి కూర్చుంటుంది నీకు కూడా చెప్పకుండా అది ఎక్కడికి వెళ్లిందో ఏమో దానికి ఊరు మీద పెత్తనాలు ఎక్కువ అయిపోయాయి నువ్వు వద్దంటున్నా మాలిని వసుంధర వల్ల ఇంటికి పదే పదే వెళుతుంది నువ్వు చాలా మారిపోయావు గౌతమ్ అని కౌసల్య అంటుంది. కౌసల్య మల్లి కి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights
Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights

చెప్పే అంత సమయం లేదు అత్తయ్య వచ్చాక చెప్తాను కానీ వసుంధర వల్ల ఇంటికి వెళ్తున్నాను అని మల్లి అంటుంది. అక్కడికి వెళ్ళొద్దని గౌతమ్ చెప్పాడు కదా అక్కడికి ఎందుకు వెళ్తున్నావ్ అని కౌసల్య అంటుంది. కౌసల్య అలా మాట్లాడుతూ ఉండగానే మల్లి ఫోన్ కట్ చేస్తుంది. నేను మాట్లాడుతూ ఉండగానే అది ఫోన్ కట్ చేసింది నువ్వు ఇచ్చిన చనువు వల్ల  అది నన్ను లెక్క చేయట్లేదు అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా వసుంధర వాళ్ళ ఇంటికి అని కౌసల్య అంటుంది. గౌతమ్ మల్లి కి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నావ్ మల్లి అని అడుగుతాడు. వచ్చాక చెప్తానండి రాత్రి ఎందుకండీ అలా చేశారు నామీద కోపం వచ్చిందా అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights
Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights

మల్లి నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు నువ్వు అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు వేయదు వెనక్కు వచ్చెయ్ అని గౌతమ్ అంటాడు. నేను రాలేనండి అని మల్లి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతుంది. గౌతమ్ దానివల్లే మనకు ఈ పరిస్థితి వచ్చింది వసుంధర మాలిని వల్ల కాదురా అది నిన్ను కలవక పోయి ఉంటే మనం ఇలా రోడ్డున పడే వాళ్ళం కాదు దానికి నువ్వు చూపించే ప్రేమ వల్ల కళ్ళు నెత్తికెక్కిరా అది ఇంకా మన తోటే ఉంటే ఈ స్థితి నుంచి ఇంకా ఏ స్థితికి వెళ్తాము బాగా ఆలోచించు అని కౌసల్య అంటుంది. మల్లి గురించి నేను ఏదో ఒకటి చేస్తానమ్మా నువ్వు వెళ్లి కాఫీ పెట్టు అని గౌతమ్ అంటాడు. మల్లి వచ్చే లోపు ఇల్లు మారిపోవాలి తను నా మాట కాదన్నందుకు మీమొ ఎక్కడ ఉన్నామో కూడా తనకి తెలియకూడదు తనని రోడ్డు మీదనే వదిలేసి వెళ్లిపోవాలి అని గౌతమ్ నిర్ణయించుకుంటాడు. కట్ చేస్తే, వసుంధర గారు వసుంధర గారు అని మల్లి పిలుస్తుంది.

Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights
Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights

ఏంటి మల్లి ఎందుకు అమ్మగారిని పిలుస్తున్నావ్ ఊరుకో నన్ను బస్టాప్ దగ్గర వదిలిపెట్టి రా అని మీరా అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటున్నావ్ నేనుండగా నిన్ను బయటికి ఎలా పంపిస్తాను అని మల్లి అంటుంది. నా ఇంటికి రావద్దు అంటున్న ఎందుకే మళ్లీ మళ్లీ వస్తున్నావు అని వసుంధర అంటుంది. నువ్వు చచ్చిపోతానని డ్రామా ప్లే చేసావ్ అంట కదా ఇప్పుడు నేను మందు తెచ్చాను తాగేసి సచ్చిపో మా అమ్మ ఇక్కడే ఉంటుంది మా నాన్న దగ్గరే ఉంటుంది అని మల్లి అంటుంది. మల్లి మాటలు జాగ్రత్తగా రాని అని మాలిని అంటుంది. నువ్వాగుమాలిని నిజం ఇప్పుడే బయటపడాలి అని శరత్ అంటాడు. అసలేం జరిగింది మల్లి అని శరత్ అంటాడు. మా అమ్మని ఎలాగూ ఇంట్లో నుంచి పంపించలేనని విష0 డ్రామా ఆడి మా అమ్మని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పంపించాలనుకుంటుంది అందుకే నేనే విషం తెచ్చాను నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఇప్పుడే విషం తాగి చచ్చిపో వసుంధర అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights
Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights

ఇన్నాళ్లు భార్యవని గౌరవం ఉండేది వసుంధర ఇలాంటి పనులు చేసి అసహ్యం కలిగిస్తున్నావు అని శరత్ అంటాడు. నువ్వేం చేసినా సరే మా అమ్మ మా నాన్న దగ్గరే ఉంటుంది తనను ఇకనుంచి పంపించాలి అంటే నేను ఉండగా జరగదు  మళ్ళీ వెళ్ళిపోతుంది. చూసావా మాలిని నాకే విషమిచ్చి చచ్చిపొమ్మంటుంది అది దాని బుద్ధి అని వసుంధర అంటుంది. కట్ చేస్తే, మల్లి  రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. మాలిని మల్లి కి కారు అడ్డం పెడుతుంది. ఎవడ్రా నువ్వు కళ్ళు కనిపించట్లేదా అని మల్లి అంటూ ఉండగా అందులో నుంచి మాలిని దిగుతుంది. ఏంటక్కా ఇలా వచ్చావ్ అని మల్లి అంటుంది. మా ఇంటికి వచ్చి మా అమ్మని విషం తాగి సచ్చిపొమ్మంటావా ఎంత ధైర్యం ఉంటే అంటావు ఆ మాట అని మాలిని అంటుంది. ఎందుకక్కా మా అమ్మ మా నాన్నతో ఉండకూడదా మీ అమ్మ మాత్రమే భార్య మా అమ్మ కాదా తనేమన్న హక్కుల గురించి అడిగిందా? పనిమనిషిలాగే ఉంటుంది కదా అలాంటి దాన్ని ఎందుకు బయటికి పంపించాలని మీ అమ్మ ప్లాన్ వేసింది అని మల్లి అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights
Malli Nindu Jabili Today Episode February 17 2024 Episode 575 Highlights

మల్లి మాటలకి కోపం వచ్చిన మాలిని మల్లి చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. ఎందుకక్కా కొట్టావ్ నిజం మాట్లాడినందుకా అని మల్లి అంటుంది.ఎప్పుడు మీరు అనుకున్నదే కరెక్ట్ అని ఎందుకు మాట్లాడుతావు మల్లి ఇతరుల బాధ ఆలోచించరా నీ వల్ల మీ అమ్మ వల్ల నాకు మా అమ్మకు అన్యాయం జరిగిపోయింది సాధారణంగా ఉండే మీరు అందన ఎక్కారు మరి మా బతుకుల మీద కొడుతుంటే మాకు బాధ అనిపించదా అని మాలిని అంటుంది. మేమేం చేశాం అక్క అని మల్లి అంటుంది. అరవింద్ ని గౌతమ్ చంపేసి సైలెంట్ గా ఉన్నాడు,గౌతమ్ మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తాను అతనికి శిక్ష పడేలా చేస్తాను నా భర్తను చంపినవని వదిలిపెట్టను అని మాలిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella