Nabha Natesh: నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `వజ్రకాయ` అనే కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నభా నటేష్.. `నన్ను దోచుకుందువటే` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ, ఈ సినిమా ద్వారా ఆమెకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు.
కానీ, రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` మూవీతో నభా యూత్‌లో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత మరిన్ని అవకాశాలను అందుకున్న ఈ బ్యూటీ.. డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.
అయితే వీటిల్లో మాస్ట్రో మినహా.. మిగిలిన చిత్రాలన్నీ ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో సరైన సక్సెస్ లేని నాభాను టాలీవుడ్ దర్శకనిర్మాతలు పక్కన పెట్టేశారు. ఇప్పుడీమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. దీంతో ఈ బ్యూటీ ఆఫర్ల కోసం సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు తెర లేపింది. తాజాగా కూడా బ్లాక్ అండ్ వైట్ చారల కోటులో నడుము, ఎద అందాలను చూపిస్తూ కిర్రాక్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. ఆపై అందకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం చెమటలు పట్టిస్తున్న ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు.. వామ్మో నభా నటేష్ ఇంత హాట్‌గా ఉందేంటి..? అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు లేటు నభా తాజా పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.