అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో నాగచైతన్య బాలరాజు లేదా “బాల” బోడిగా కనిపించనున్నాడు. అమెరికన్ కామెడీ డ్రామా ఫారెస్ట్ గంప్ సినిమాలో టామ్ హ్యాంక్‌కి ఆర్మీలో పరిచయమయ్యే బెంజమిన్ బుఫోర్డ్ లేదా “బుబ్బా” పాత్రను మైకెల్టీ విలియమ్సన్ చేశాడు. అయితే లాల్ సింగ్ చడ్డాలో ఈ బుబ్బా క్యారెక్టర్లో నాగచైతన్య నటించాడు. లాల్ సింగ్ చడ్డా సినిమా కథని మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా మార్చారు కాబట్టి నాగ చైతన్యను ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని బోడిపాలెం గ్రామానికి చెందిన వాడిగా చూపించారు. చైతు కార్గిల్ యుద్ధంలో లాల్ సింగ్‌ను కలుస్తాడు. వీరిద్దరి మధ్య చెప్పుకోదగిన సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. మరి ఇలాంటి కీలక పాత్రలో నటించిన చైతన్య ఎంత పారితోషికం పుచ్చుకున్నాడు తెలుసా?
అతని రెమ్యునరేషన్ ఎంత అంటే
ఈ మూవీని తెలుగు రాష్ట్రాలలో ప్రచారం చేయటం కోసం ఆమిర్ ఖాన్‌తో కలిసి నాగచైతన్య ప్రచార కార్యక్రమాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే అతని రెమ్యునరేషన్ ఒక హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా టాలీవుడ్లో నాగచైతన్య ఒక్కో సినిమాకి రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటాడనే టాక్ ఉంది. అయితే లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం రూ.5 కోట్లు పారితోషకం తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర ప్రధాన పాత్రలతో పోలిస్తే చిన్నదే అయినప్పటికీ, ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఉంటుంది. అందుకే నాగచైతన్యకు ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. లాల్ సింగ్ చడ్డా సినిమా మంచి హిట్ సాధిస్తే మాత్రం నాగచైతన్యకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. అలానే నాగచైతన్య మార్కెట్ పెరిగినట్టే.
చైతు అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్
ఇటీవలే తెలుగులో విడుదలైన థాంక్యూ సినిమా నాగచైతన్యకు పరాజయాన్ని రుచి చూపింది. ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేస్తున్నాడు. అంతేకాకుండా ‘డిజె టిల్లు’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ విమల్ కృష్ణతో కూడా నాగచైతన్య సినిమా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వీటితోపాటు ‘దూత’ అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!