Prabhas: డార్లింగ్ హీరో ప్రభాస్ అభిమానులకు పూనకం తెప్పించే న్యూస్ ఇది. అవును.. గతంలో రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనం చెప్పుకోవలసిన పనిలేదు. ఒక్క బాహుబలి సినిమాతో వీరు తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించారు. ఇక ఆ సినిమాతో మన డార్లింగ్ తలరాత పూర్తిగా మారిపోయిందనే చెప్పుకోవాలి. తరువాత ఆయన వరుసగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బాలీవుడ్ హీరోలకు సైతం చెమటలు పుట్టిస్తున్నాడు.
Prabhas: కొత్త ప్రాజెక్ట్‌కు అన్నీ సెట్..ఆ ఒక్కటీ తప్ప..!
Prabhas: ప్రభాస్ – జక్కన్న కొత్త సినిమా?
బాహుబలి అనంతరం రాజమౌళి దర్శకత్వంలో మరలా తమ డార్లింగ్ ప్రభాస్ సినిమా ఎప్పుడు వుంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుండగానే ఒక శుభవార్త బయటకు వచ్చింది. తాజాగా ఈ విషయమై ప్రభాస్ కూడా నోరు జారడంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇకపోతే ప్రభాస్ రాధేశ్యామ్ ప్రమోషన్ లలో బిజీగా గడుపుతున్నాడు. మరో వారం రోజుల్లో రాధే శ్యామ్ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని విషయం తెలిసినదే.
Prabhas: పూజా హెగ్డేతో ఆ సీన్ చేయడం చాలా సిగ్గుగా అనిపించింది: ప్రభాస్
సినిమా పేరు ఇదేనా?
ఇకపోతే, ప్రభాస్ ప్రస్తుతం ‘సాలార్’, ‘ఆదిపురుష్’ వంటి పాన్ ఇండియా స్థాయి సినిమాతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రాజమౌళి కాంబో విషయం బయటకు వచ్చింది. అలాగే వారి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పేరు ‘గరుడ’ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ ముచ్చట పెడుతున్నారు. ఇక ఈ కాంబో సినిమాకి చాలా సమయం పట్టేలా ఉందని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే ‘సాలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలు పూర్తైతేగాని ఓ క్లారిటీ రాదు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!