NewsOrbit
సినిమా

Rana Daggubati: నీది యాక్టింగ్ కాదు.. రానాను ముఖంపైనే తిట్టేసిన స్టార్ హీరో!

Rana Daggubati: రానా ద‌గ్గుబాటి.. ఈయ‌న గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లీడర్` మూవీతో హీరోగా టాలీవుడ్‌లో సినీ కెరీర్ ప్రారంభించిన రానా.. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ త‌న‌దైన టాలెంట్‌తో తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి రానాను ఓ స్టార్ హీరో నీది యాక్టింగ్ కాదంటూ ముఖంపైనే తిట్టేశాడ‌ట‌. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు సూర్య‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

సూర్య న‌టించిన తాజా చిత్రం `ఈటి`. పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీతో మార్చి 10న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నారాయణ్‌దాస్‌ నారంగ్, డి. సురేష్‌బాబు, దిల్‌ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో ఈటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌గా.. హీరో రానా, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు గోపీచంద్‌ మలినేని స్పెష‌ల్ గెస్ట్‌లుగా విచ్చేశారు.

అయితే ఈ సంద‌ర్భంగా రానా మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్‌లో నేను నటించిన ఒక సినిమాను సూర్య ఎడిటింగ్ రూమ్ లో చూశారు. ఆ తర్వాత నన్ను కారులో ఎక్కించుకుని నీది యాక్టింగ్‌ కాదురా.. ఏదో సర్దేస్తున్నావ్‌.. అంటూ నాలుగు గంటల పాటు నాన్ స్టాప్ గా క్లాస్ పీకారు. ఆరోజు సూర్య పీకిన క్లాస్ వల్ల నా నటన మెరుగుప‌డింది.

ఆ త‌ర్వాతే నేను భల్లాల దేవుడిగా మారా, ఇప్పుడు డానియల్ శేఖర్ ని అయ్యా..` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడీయ‌న కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, రానా ఇటీవ‌లె `భీమ్లా నాయ‌క్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో ప‌వ‌ర్ క‌ళ్యాణ్ మ‌రో కీల‌క పాత్ర‌ను పోషించారు. ఫిబ్ర‌వరి 25న రిలీజైన ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N