సాధారణంగా ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు డైరెక్టర్లతో ఆయిన కెమెరామెన్ తో అయినా రిలేషన్ పెట్టుకుంటూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక 2023లో సినీ సెలబ్రెటీలు ఎక్కువమంది వివాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వారి ప్రేమను కొందరు పెళ్లి పేరుతో బయట పెడుతుంటే మరికొందరు మాత్రం పరోక్షంగా బయటపెడుతున్నారు.
ఇక తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తను ప్రియుడిని పరిచయం చేసి షాక్ ఇచ్చింది. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ముద్దుగుమ్మ ప్రేమించింది కూడా ఇండస్ట్రీలో ఉన్న వారిని. ఇక హీరోయిన్ ఎవరు? ఆమె ప్రేమించింది ఎవరిని అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మలియాల్ నటి రజిష్ విజయం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఓటిటి ఫ్లాట్ ఫారం మీద కొంచెం గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ రవితేజ ” రామారావు ఆన్ డ్యూటీ ” సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమెకి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఇక ప్రస్తుతం ఈమె తమిళ్లో అడపాదడపా సినిమాలు చేస్తూ తన కెరీర్ని సాగిస్తుంది. ఇక ఈమె ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ విషయం నేరుగా ఈ ముద్దుగుమ్మనే పరోక్షంగా బయటపెట్టింది. తాజాగా పెట్టిన ఇన్స్టా పోస్ట్ చూస్తుంటే వీళ్ళిద్దరి ప్రేమాయణం ఎప్పటినుంచో నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఈమె షేర్ చేసిన ఫోటో కింద ” 1461 రోజులు కలిసి ఉన్నాం. ఎంతో ప్రేమ మరియు సంతోషం ఇద్దరి అల్లరి నీ భరిస్తూ మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం ” అంటూ రాసుకు వచ్చింది. ఇక దీంతో వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారని ఫుల్ గా ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!