Raviteja: తాజాగా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం టైగర్ నాగేశ్వర రావు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. క్రాక్ సినిమాతో మాస్ మహారాజ సూపర్ ఫాంలోకి వచ్చాడు. దాంతో వరుసబెట్టి అరడజను సినిమాలకు పైగా లైన్లో పెట్టాడు. అంతేకాదు ఇప్పుడు ఏ హీరో చేయనంత స్పీడ్‌గా సినిమాలను కంప్లీట్ చేస్తూ వస్తున్నా రు. గత చిత్రం ఖిలాడి ఫ్లాపయినా కూడా ఆ ప్రభావం రవితేజ మీద ఏమాత్రం పడలేదు. త్వరలో నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్‌డ్యూటీ సినిమాను తీసుకు వస్తున్నారు.
అలాగే, ధమాకా..రావణాసురా సినిమాలను చక చకా కంప్లీట్ చేస్తున్నారు మాస్ మహా రాజ. ఈ క్రమంలోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా టైగర్ నాగేశ్వర రావు సినిమాను లాంచ్ చేశారు. వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, మోడల్ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నా రు. అలాగే, రేణు దేశాయ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఈ సినిమాను పేరు మోసిన స్టూవర్టుపురం గజ దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్నారు.
Raviteja: పాన్ ఇండియన్ స్థాయిలో హిట్ గ్యారెంటీ..
అయితే, తాజాగా ప్రారంభమయిన ఈ సినిమా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముందు కథ న వద్దకే వచ్చిందని తెలిపారు. అంతే కాదు నేను చేయలేకపోయానే అని బాధపడిన కథను నా తమ్ముడే చేస్తున్నాడు. ఈ కథ నాకంటే నా తమ్ముడికే బాగా సూటవుతుందని చెప్పారు. దాంతో కొందరు చిరు వదిలేసిన కథతో రవితేజ హిట్ కొడతాడా..అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ, మెగాస్టార్ కుదరక వదిలేసిన కథ కాబట్టి ఇలాంటి మాస్ కథలు మాస్ మహారాజాకు బాగా సూటవుతాయి కాబట్టి ఖచ్చితంగా పాన్ ఇండియన్ స్థాయిలో హిట్ గ్యారెంటీ అని ఇటు మెగా అభిమానులు అటు మాస్ రాజా అభిమానులు చెప్పుకుంటున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!