Renu Desai: నటి, దర్శకురాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఖుషి` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన రేణు దేశాయ్.. ఆ తర్వాత జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాల్లో నటించింది. పవన్‌తోనే అన్ని సినిమాలు చేసిన రేణు.. చివరకు ఆయన్నే పెళ్లాడింది.
అయితే 2004లో వీరిద్దరికి పెళ్ళి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు. 2009 లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్ళి చేసుకోగా.. ఆపై ఈ దంపతులకు కూతురు ఆద్య జన్మించింది. కానీ, ఆ తర్వాత వచ్చిన మనస్పర్థల కారణంగా పవన్, రేణు దేశాయ్‌లు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం పిల్లలతో ఒంటరిగానే జీవిస్తున్న రేణు.. ఇటీవల బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు షోలకు జడ్జ్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. త్వరలోనే ఈమె వెండితెరపై కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతోందట. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. టైగర్ నాగేశ్వరావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు.
అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ రేణు దేశాయ్‌ను సంప్రదించగా.. ఆమె సానుకూలంగా రిప్లై ఇచ్చిందని అంటున్నారు. ఇంతకీ ఈ చిత్రంలో రేణు పాత్రేంటో తెలుసా..? రవితేజ సోదరి పాత్ర. అవును, రవితేజ సోదరి పాత్రలో ఆమె నటించనున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల కానుంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!