Samantha Naga Chaitanya: నవంబర్ 23వ తారీకు అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కినేని అభిమానులు చైతు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా టైటిల్ “తండేల్” ప్రకటించడం జరిగింది. సముద్రం నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఫుల్ మాస్ పాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఇదే సమయంలో పుట్టినరోజు కానుకగా తన కెరియర్ లో “దూత” అనే వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూత స్ట్రీమింగ్ కానుంది.
ఇదంతా పక్కన పెడితే నాగచైతన్య కి పుట్టినరోజు నాడు మాజీ భార్య సమంత నుండి సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడాకులు తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో విడాకులు తీసుకున్న సమయంలో ఆస్తులు ఇంకా వస్తువులు అన్ని.. ఎవరికి వారు వెనక్కి ఇచ్చేసుకున్నారు. కానీ సమంత వద్ద నాగచైతన్య కి సంబంధించి బ్రేస్ లెట్ ఉండటం జరిగిందట. ఆ సమయంలో అది వెనక్కి ఇవ్వలేదు. అయితే ఇన్ని రోజులు తన వద్దనే ఉంచుకున్న సమంత… నాగచైతన్యకి వెనక్కి ఇచ్చేయాలని కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుందట.
అందుకే నవంబర్ 23వ పుట్టినరోజు చైతు పుట్టినరోజు సందర్భంగా ఆ బ్రాస్ లైట్ నీ గిఫ్ట్ కింద ప్యాకింగ్ చేసి.. రిటర్న్ ఇచ్చేయడం జరిగిందట. ఈ బహుమతిని చూసిన నాగచైతన్యకి నవ్వాలో ఏడవలో తెలియని పరిస్థితి నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వస్తున్న ఈ వార్తలో వాస్తవం ఎంతో తెలియదు గాని వీళ్లిద్దరూ మళ్లీ కలిస్తే ఆనందపడే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో చూడముచ్చటగా ఉండి ఈ జంట పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడం అందరికీ షాక్ కి గురి చేయడం జరిగింది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ ఎవరికివారు కెరియర్ పరంగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!