సమంత… ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి, తన సరసన హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యను 2017లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటిస్తూ మహిళా సాధికారతకు ప్రతిబింబంగా నిలిచింది. తన నటనతో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో మంచి పేరుతో పాటు.. కుర్రకారు మతిపోగొట్టేసింది.
ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా సమంత సినిమాలు ఒప్పుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. తాను పిల్లలు కనేందుకే సినిమాలు చేయటం లేదనే కామెంట్ వినిపిస్తుంది. దీనిపై ఆమె స్పందించి పిల్లలు కావాలి అనుకున్నపుడు కంటానని తెలిపింది. పిల్లలు జన్మించాక వాళ్లే తన ప్రపంచం అని తెలిపింది.
ప్రస్తుతం సమంత సామ్ జామ్ షోకి హోస్ట్ గా చేస్తుంది. ఈ షోలో టాలీవుడ్ ప్రముఖులను సమంత తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ.. తన ముద్దు ముద్దు మాటలతో అలరిస్తుంది. ఆహా ఓటీటీలో ప్రసరమయ్యే ఈ షోకి మంచి స్పందన లభిస్తుంది. ఇప్పటికే ఈ షోలో విజయ దేవరకొండ, రానా దగ్గుబాటి, నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. తాజాగా మూడవ ఎపిసోడ్ లో నడుస్తుంది. ఈ ఎపిసోడ్ లో బ్యాడ్మింటన్ స్టార్ అయిన సైనా నెహ్వాల్, కశ్యప్ లు వచ్చినట్టు ప్రోమోలు విడుదల అయ్యాయి.
సామ్ జామ్ వెబ్ సిరీస్ తో బిజీ గా ఉన్న సమంత, విజయ్ సేతుపతి హీరోగా తమిళ చిత్రంలోను నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యే “ఫ్యామిలీ మాన్” అనే వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్ర లో నటిస్తుంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!