హత్య కేసులో ఓ నటిని పోలీసులు అరెస్ట్ చేయించారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా! .. శాండిల్‌వుడ్‌కు చెందిన ప్రియాంక. ఈమె పలు కన్నడ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. జనవరి 29న సునీల్ అనే రౌడీ షీటర్‌ను కొందరు హత్య చేశారు. పోలీసుల దర్యాప్తులో ప్రియాంక, ఆమె తల్లి నాగమ్మ హస్తం ఉందని తెలిసింది. దాంతో ప్రియాంక, ఆమె తల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరకు వారు రామ్‌నగర్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
రౌడీ షీటర్ సునీల్ వరుసకు ప్రియాంకకు బావ అవుతాడు. తను ఒకానొక సమయంలో ప్రియాంక డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో సునీల్ గురించి తెలుసుకున్న ప్రియాంక, నాగమ్మ అతన్ని పనిలో నుండి తీసేశారు. కానీ సునీల్ వారిని బెదిరించి డబ్బులు గుంజేవాడు. సునీల్ సమస్యను తప్పించుకోవడానికి ప్రియాంక, నాగమ్మ సునీల్‌ను చంపేసే ప్లాన్ వేసి హత్య చేయించారట. ఇప్పుడు ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
previous post
next post
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!