బిగ్ బాస్ హౌస్ లేటెస్ట్ ప్రోమోలు చూస్తే కెప్టెన్ గా సోహెల్ ఎన్నికైనట్టు అర్థమవుతోంది. స్టార్టింగ్ లో సోహెల్ కి హౌస్ లో ఆడుతున్న విధానం చూసి బయట జనాలు దీనికి ఆవేశం ఎక్కువ తొందరగానే బయటకు వచ్చేస్తాడు అని చాలా మంది ఆవేశం స్టార్ అంటూ ట్రోల్స్ చేయడం జరిగింది. కానీ రాను రాను మాటతీరు ఎలా ఉన్నా గాని స్ట్రైట్ గేమ్ ఆడుతూ… సోహెల్ వ్యవహరిస్తున్న తీరు పట్ల బయట జనాలు అతనిపై విపరీతమైన అభిమానం పెరుగుతూ వస్తోంది.
కాగా కెప్టెన్ అయిపోయినా తరువాత కూడా సోహెల్ బ్యాలెన్సింగ్ మైండ్ గేమ్ ఆడకుండా చిన్న ఈ విషయంలో సహనం కోల్పోయి అరిచినట్లు తెలుస్తోంది. తాను మొట్టమొదటిసారిగా కెప్టెన్ అయిన తర్వాత హౌస్ లో నీళ్లు రాకపోవటంతో సోహెల్ సహనం కోల్పోవడంతో.. కెప్టెన్ గా ఎన్నికైన కాసేపటికే కొంపముంచినటు అరిచాడు అని ప్రోమోలు బట్టి అర్థమవుతుంది.
ప్రస్తుతం సోహెల్ కెప్టెన్ గా సెలెక్ట్ కావటంతో ఇప్పుడైనా అతని ప్రవర్తనలో మార్పు రావాలని మరికొంత మంది కోరుకుంటున్నారు. చాలా బలమైన కంటెస్టెంట్ అయ్యే అవకాశం క్వాలిటీస్ సోహైల్ లో ఉన్నాయని బయట జనాలు అంటున్నారు. ఉన్న పాయింట్ ని నిర్మొహమాటంగా చెప్పటంలో గాని సోహెల్ ఆడుతున్న ఫెయిర్ గేమ్ హౌస్ లో మారెవరు ఆడటం లేదని.. ఈ టైములో సోహెల్ తన టెంపర్ తనాన్ని తగ్గించుకుంటే… రాబోయే రోజుల్లో హౌస్ లో తిరుగులేని కంటెస్టెంట్ అవుతాడని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.