Prabhas Mahesh: టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టించడంలో ఎప్పుడూ ముందుంటారు ప్రభాస్ మహేష్. ఇద్దరి సినిమాలకి ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక ఇతర భాషలలో భారీ స్థాయిలో మార్కెట్ ఉంది. ప్రభాస్ బాహుబలి సినిమా తో అంతర్జాతీయస్థాయిలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఇండియన్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇక మహేష్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.
అటువంటి హీరోలైన వీరిద్దరి గురించి తాజాగా నటుడు సుబ్బరాజు కీలక కామెంట్లు చేశారు. ప్రభాస్ చూడటానికి చాలా టఫ్.. కానీ అంతర్గతంగా ప్రభాస్ చాలా సెన్సిటివ్ అయిన వ్యక్తి అని తెలిపాడు. అతనితో వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదని చాలా ఫన్ వాతావరణం అతని చుట్టూ ఉంటుందని.. సుబ్బరాజు చెప్పుకొచ్చాడు. ఇక ఇదే రీతిలో మహేష్ గురించి మాట్లాడుతూ.. చూడటానికి చాలా సెన్సిటివ్ గా కనబడుతున్న గాని నటన పరంగా అన్ని విషయాల్లో చాలా పక్కాగా మహేష్ ఉంటాడని తెలిపాడు.
Read More: Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కెరీర్లో నటించడానికి ఇబ్బంది పడ్డ సీన్ అదేనట..!!
ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే రీతిలో వ్యవహరిస్తాడని సుబ్బరాజు చెప్పుకొచ్చాడు. సెట్స్ లో ప్రతి విషయంలో.. పక్కాగా ఉంటాడని.. అన్ని విషయాలు పక్కాగా తెలుసుకుంటారని.. అప్డేట్ అవుతాడని.. పేర్కొన్నాడు. సుబ్బరాజు ప్రభాస్ నటించిన బుజ్జిగాడు, బాహుబలి ఇంకా కొన్ని సినిమాలలో నటించడం జరిగింది. మహేష్ బాబుతో “అతిధి” సినిమాలో.. “పోకిరి” లో నటించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటులుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు గురించి సుబ్బరాజు వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!