SVP: సూపర్ స్టార్ కృష్ణ తాజాగా మహేష్ నటించిన “సర్కార్ వారి పాట” సినిమా విజయం పట్ల స్పందించారు. ఆ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ అనేక విషయాలు తెలియజేశారు. “సర్కారు వారి పాట” మహేష్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ అయినా సినిమా అని స్పష్టం చేశారు. పోకిరి, దూకుడు కంటే ఈ సినిమా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు సెకండ్ హాఫ్ లో మహేష్ పర్ఫామెన్స్ తో సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యిందని కృష్ణ తెలియజేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్ లు నిండిపోతున్నాయి అని అన్నారు. కానీ కొన్ని చానల్స్ పనిగట్టుకుని సినిమాపై నెగిటివ్ ప్రచారం… చేస్తున్నారు జనాలు రావటం లేదు అని డివైడ్ టాక్ తీసుకురావాలని భావించారు. కానీ జనాలలో అటువంటి టాక్ ఏమీ లేదు.. అంటూ నెగిటివ్ ప్రచారం చేయడంపై కృష్ణా మండిపడ్డారు. ఇంకా సినిమాలో మహేష్ బాబు చాలా అందంగా ఉన్నాడు. “పోకిరి”లో కంటే ఈ సినిమాలో ఇంకా తక్కువ వయసు ఉన్న వ్యక్తి గా కనిపించాడు. మహేష్ బాబు సినిమా షూటింగ్ లు లేని టైం లో ఎక్కువగా జిమ్ లోనే ఉంటాడు.
సినిమా చూస్తే మహేష్ బాగా మెయిన్టైన్ చేస్తున్నాడు అని అనిపించింది అంటూ…. “సర్కారు వారి పాట” విజయం పట్ల సూపర్ స్టార్ కృష్ణ తనదైనశైలిలో రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా.. 150 కోట్లు కలెక్ట్ చేసే దిశగా దూసుకుపోతుంది. కుటుంబ ప్రేక్షకులు సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ మళ్లీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఒక పక్క మీడియా మరోపక్క కొంతమంది హీరోల అభిమానులు నెగిటివ్ ప్రచారం చేసిన దాన్ని సర్కారు వారి పాట కలెక్షన్ లు ఏ మాత్రం తగ్గటం లేదని సినిమా నిర్మాతలు చెప్పుకొస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!