దర్శకుధీరుడు దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో తారక్ తెలంగాణ పోరాటయోధుడు కొమురం భీమ్‌గా నటిస్తుండగా.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మన్యంవీరుడిగా అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. చరిత్రలో ఈ రెండు పాత్రలు కలుసుకుంటే ఎలా ఉంటుంది? అనే కల్పితమైన ఆలోచనతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన లుక్స్‌ని ఇప్పటి వరకు రాజమౌళి అండ్ టీమ్ ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే సినీ వర్గాల సమాచారం మేర అక్టోబర్ 22న కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ లుక్‌ని విడుదల చేస్తారట. ఆరోజునే ఎన్టీఆర్ లుక్‌ని విడుదల చేయడానికి కారణం.. కొమురం భీమ్ పుట్టినరోజు అక్టోబర్ 22న కావడమే. ఈ భారీ చిత్రంలో అజయ్ దేవగణ్, ఆలియా భట్, సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తాం.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!