స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ తన బీస్ట్‌ను అందరికీ పరిచయం చేశాడు. ఇంతకు బీస్ట్ ఎవరు? అనే సందేహం వస్తుంది. బీస్ట్ ఎవరో కాదు.. బన్నీ కొనుగోలు చేసిన కొత్త రేంజ్ రోవర్ కారు. కారుతో పాటు బన్నీ ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన బన్నీ ‘‘నేను కొత్త కారుని కొన్నాను. దానికి బీస్ట్ అనే పేరుని పెట్టాను. నేను కొత్తగా ఏదైనా కొన్న ప్రతిసారి నా మదిలో మెదిలేది ఒకటే.. కృతజ్ఞతలు’’ అనే మెసేజ్‌ను పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపయోగించే వాహనం నిక్ నేమ్ కూడా ‘బీస్ట్’. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’. దీని తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రం.. సుకమార్ దర్శకత్వంలో మరో చిత్రంలో బన్నీ నటించనున్నారు.
previous post
next post