Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ఈయనకి ఇందుకుగాను నేషనల్ అవార్డు సైతం అందింది.
ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే బేబీ సినిమాతో తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోయిన పేరు SKN. ఇక ఇటీవలే ఈయన తండ్రి మరణించడంతో కృంగిపోయాడు SKN. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈయన ఇంటికి వెళ్లి పలకరించాడు.
అల్లు అర్జున్ తన ఇంటికి రావడం పట్ల SKN ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ” ఈ క్లిష్ట సమయంలో నా ఇంటికి వచ్చినందుకు నా ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా తండ్రి మృతికి ఆయన ఉనికి మరియు సంతాపం నాకు ప్రపంచాన్ని సూచిస్తుంది.
మీ దయ, మద్దతుకు ధన్యవాదాలు ” అంటూ ఐకాన్ స్టార్ తన తండ్రికి దండం పెట్టుకుంటున్న ఇమేజ్ ని షేర్ చేసి క్యాప్షన్ రాసుకొచ్చాడు SKN. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” ఐకాన్ స్టార్ ది ఎంత గొప్ప మనసు అనేది మరోసారి వెల్లడయ్యింది. మీ మీద ఉన్న రెస్పెక్ట్ మాకు మరింత పెరిగింది అన్న ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.
I am immensely grateful to my dear Icon star @alluarjun garu for his heartfelt visit to my home during this difficult time. His presence and condolences for my father’s passing mean the world to me. Thank you for your kindness, support 🙏🏻 pic.twitter.com/Z4yHIRAwWR
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 23, 2024
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!