సాధారణంగా పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం. కొందరు తమ పెళ్లిని ఎంతో అంగరంగ వైభోగంగా జరుపుకుంటారు. మరికొందరు మాత్రం ఎప్పటికీ బ్యాచిలర్ గా ఉండిపోతారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోలు వయసు మీద పడుతున్న ఏమాత్రం లెక్కచేయకుండా బ్యాచిలర్ గానే ఉండిపోయారు. సాధారణంగా 30 ఏళ్లు వస్తే పెళ్లి వయసు వచ్చిందని ప్రతి ఒక్కరూ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ అదే 40 ఏళ్లు వస్తే తమకి అమ్మాయిని ఇవ్వడానికి చాలామంది ఇబ్బంది పడతారు కూడా. ఇక మన టాలీవుడ్ హీరోలు 40 ఏళ్లు మీద పడిన పెళ్లిపై ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. పెళ్లి మాటని దాటి వేస్తూ సినిమాలతో ఫుల్ బిజీ లైఫ్ని కొనసాగిస్తున్నారు. ఇక వారెవరో ఇప్పుడు చూద్దాం.
1. ప్రభాస్:
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ఈయనకి 43 ఏళ్లు వయసు వచ్చిన స్టిల్ బ్యాచిలర్ గానే ఉండిపోయాడు. తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు.
2. విశాల్:
ఈయన తెలుగులో సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈయన ఓ తమిళ్ హీరో. ఈయనకి కూడా 45 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు.
3. సిద్ధార్థ్:
2003లో చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్ అనంతరం ఏవో కారణాల చేత విడిపోయాడు. ఇక అప్పటినుంచి తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేస్తూ పెళ్లి బంధానికి దూరమయ్యాడు. ఇక ఈయన వయసు 44 సంవత్సరాలు.
పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం కావాలి. కానీ వీరి ముగ్గురు మాత్రం 40 ఏళ్లు దాటుతున్న పెళ్లి ఊసు ఎత్తడం లేదు. మరి రానున్న రోజుల్లో ఈ హీరోలు ఏమన్నా పెళ్లిపై దృష్టి పెడతారో లేదో చూడాలి మరి.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!