NTR: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో మాస్ ఇమేజ్ కలిగిన టాప్ హీరోలలో తారక్ ఒకరు. నందమూరి కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. స్టార్టింగ్ లో వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవటం జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన “సింహాద్రి”.. ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భయంకరంగా లావు అవ్వడంతో.. అనేక విమర్శలు కూడా వచ్చాయి. పరిస్థితి ఇలా ఉంటే ఆ టైంలో మళ్లీ ఎన్టీఆర్ తో రాజమౌళి “యమదొంగ” అనే సినిమా ప్రకటించడం జరిగింది. అయితే ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కి రాజమౌళి కండిషన్ పెట్టారు.
విషయంలోకి వెళ్తే మొత్తం లావు తగ్గాలని.. ఎన్టీఆర్ కి షరతు పెట్టి “యమదొంగ” సినిమా తీసి.. సూపర్ హిట్ అందుకోవటం జరిగింది. ఇంకా అప్పటినుండి ఫుల్ ఫిట్నెస్ తో తారక్ బాడీ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అంతకుముందు.. విపరీతంగా తినే అలవాటు కలిగిన తారక్ తర్వాత తన డైట్ చాలా కంట్రోల్ చేయడం జరిగింది. క్రమక్రమంగా బరువు తగ్గి స్లిమ్ గా మారి ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ కలిగిన హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. గత ఏడాది విడుదలైన “RRR” కోసం ఎన్టీఆర్.. తన బాడీ పూర్తిగా మలుచుకోవడం తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ ఫిజిక్ కి కూడా చాలామంది ఫిదా అయ్యారు. అటువంటి ఎన్టీఆర్ తన ఫిజిక్ విషయంలో డైట్ విషయంలో ప్రతిరోజు తినే ఐటమ్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ముఖ్యంగా పొద్దున్నే లేవగానే యోగా ఎక్సర్సైజ్ లు రెండు గంటల పాటు చేస్తారట. ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా రాగిజావని కంపల్సరిగా రెండు గ్లాసులు తాగుతారట.
దీని తర్వాత వాటర్ లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. అనంతరం రెండు లేదా మూడు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుని పొద్దున్నే అల్పాహారం ముగిస్తారట. అప్పుడప్పుడు జ్యూసులు తీసుకుంటారట. వేసవికాలంలో మాత్రం కంపల్సరిగా రోజుగా ఫ్రూట్ జ్యూస్ ఉదయాన్నే.. డైట్ లో తారక్ తీసుకుంటారట. ఇక మధ్యాహ్నం భోజనం చాలా పరిమితంగా.. తింటారట ఎక్కువగా రాగిజావతో నాటుకోడి ఇష్టంగా తింటారట. నైట్ డిన్నర్ కి చాలావరకు భోజనాన్ని పక్కకు పెట్టి ఫ్రూట్ జ్యూస్ లతో సరి పెట్టేస్తారట. ఉదయమే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ టిఫిన్ గట్టిగా తీసుకుంటారంట. ఈ రకంగా తన బాడీ మెయింటైన్ చేస్తారట. ఎన్టీఆర్ డైట్ మెనూ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ ఉండటంతో.. చాలామంది వార్త చూసి ఏంటి అంత టిఫిన్ తింటారా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు డైట్ మైంటైన్ చేస్తున్న తారక్ స్టార్టింగ్ లో “యమదొంగ” ముందు మాత్రం నాన్ స్టాప్ ఫుడిష్ అని టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!