Pawan Kalyan: డైరెక్టర్ హరీష్ శంకర్ త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్టు అధికారికంగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ప్రకటించడం జరిగింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ కి “గబ్బర్ సింగ్” వంటి బ్లాక్ బస్టర్ విజయం హరీష్ ఇవ్వటంతో అప్పటినుండి తాజాగా ఈ ప్రాజెక్టుపై అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో… చాలామంది సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి రకరకాల టైటిల్స్ ఇదేనంటూ వైరల్ చేస్తూ ఉన్నారు. “స్టేట్ కి ఒక్కడు”, “సంచారి” అంటూ రకరకాల వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్స్ అంటూ.. వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇటువంటి తరుణంలో తాజాగా వస్తున్న ఈ వార్తలను డైరెక్టర్ హరీష్ శంకర్ ఖండించారు. అంతమాత్రమే కాకుండా … అటువంటి టైటిల్స్ ప్రచారం చేస్తున్నా ఐడీలను బ్లాక్ చేయించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ గెటప్ లో మాత్రం కనిపించడం జరుగుతుందట.
Read More: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ లో సమంత..??
దానికి సంబంధించిన లుక్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనగా సెప్టెంబర్ రెండవ తారీకు రిలీజ్ చేయాలని.. ఆరోజు టైటిల్ ప్రకటించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాకి సంబంధించి కీలక నటీనటులను ఎంపిక చేస్తూ .. హరీష్ శంకర్ బిజీగా ఉన్నారట. పవన్ అభిమానులు కోరుకునే రీతిలో పొలిటికల్ మైలేజ్ వచ్చే విధంగా సినిమా స్క్రిప్ట్ హరీష్ డిజైన్ చేసినట్లు ఫిలిం వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి.