NewsOrbit
రివ్యూలు సినిమా

అల్లుళ్లు బాగా నవ్వించారు

సంక్రాంతి పండక్కి పెద్ద సినిమాలు వస్తుండడంతో అందరి అంచనాలు వాటిపైనే ఉన్నాయి. ఈ భారీ సినిమాల మధ్యలో వెంకీ-వరుణ్ నటించిన ‘ఎఫ్ 2’ సినిమా కూడా రేస్ లో నిలిచింది. మరి సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చిన వెంకటేష్- వరుణ్ తేజ్ ప్రేక్షకులని మెప్పించారో లేదో చూద్దాం. అమ్మా నాన్న లేని వెంకీ(వెంకటేష్) ఒక ఎమ్మెల్యే (రఘు బాబు) దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. వెంకీ అనాధ కావడంతో అందం, తెలివి రెండూ ఉన్న హారిక (తమన్నా) అతన్ని పెళ్లి చేసుకుంటుంది. మొదట్లో బాగానే ఉన్న వెంకీ కాపురం ఆరు నెలలకే తిరగబడుతుంది. స్వేచ్ఛగా ఉండే వెంకీ జైల్లో ఖైదీగా ఫీల్ అవ్వడం మొదలు పెడతాడు. పైగా భార్య, అత్తమామల ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ కావడంతో వెంకీ పెళ్లి జీవితం నరకంగా మారుతుంది. హారిక చెల్లెలు హని (మెహరీన్‌) బోరబండ కుర్రాడైన వరుణ్‌ యాదవ్‌( వరుణ్‌ తేజ్‌)తో ప్రేమలో పడుతుంది. హారిక కుటుంబం గురించి తెలిసిన వెంకీ, వద్దని ఎంత చెప్పినా వినకుండా వరుణ్‌, హనీతో పెళ్లికి రెడీ అయిపోతాడు. వెంకీకి అయినా పెళ్లి తర్వాత జీవితం మారింది కానీ వరుణ్ కి మాత్రం నిశ్చితార్ధంతోనే చుక్కలు కనిపిస్తాయి. దీంతో ఎలా అయినా హారిక, హనీలని అదుపులో పెట్టుకోవాలని భావించి, ఎదురింటి వ్యక్తి(రాజేంద్రప్రసాద్‌) చెప్పిన మాటలు విని వెంకీ తన భార్యను, వరుణ్‌ తనకు కాబోయే భార్యను వదిలేసి యూరప్‌ వెళ్లిపోతారు. ఈ పరిస్థితిలో వెంకీ-వరుణ్ మళ్లీ తిరిగి వాళ్ల ఫ్యామిలీ లైఫ్ ని సెట్ చేసుకున్నారా లేదా? సెట్ చేసుకోవడానికి వారు పడిన కష్టాలేంటి అనేదే ‘ఎఫ్2’ సినిమా కథా కథనం.

న‌టీన‌టులు:
సీనియర్ హీరోల్లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన వెంకటేష్ మరోసారి తనకి టైలర్ మేడ్ లాంటి వెంకీ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. సరైన పాత్ర పడితే ఇప్పటికీ సినిమాని ముందుండి నడిపించగల సత్తా తనలో ఉందని ప్రూవ్ చచేసిన వెంకటేష్, ఎఫ్ 2 సినిమాని ముందుండి నడిపించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అయితే సోలో పెర్ఫార్మెన్స్ తో సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. మరో హీరోగా నటించిన వరుణ్ తేజ్‌ కూడా మంచి తెలంగాణ యాసతో, మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్స్ చెప్పే సమయంలో కొంచెం ఇబ్బంది పడినట్లు అనిపించినా కూడా పక్కనే ఉన్న వెంకీ దాన్ని కనిపించకుండా చేశాడు. హారిక, హనీ పాత్రల్లో కనిపించిన తమన్నా, మెహ్రీన్ మంచి పాత్రల్లో కనిపించారు. తమన్నా తన పాత్రకి పూర్తిగా న్యాయం చేసినా కూడా మెహ్రీన్ కొంచెం వీక్ గా కనిపించింది, తన యాక్టింగ్ లో న్యాచురాలిటీ లోపం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. గ్లామర్‌ షోలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రగతి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు తమ పాత్రలకి పూర్తిగా న్యాయం చేస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా నవ్వించే ప్రయత్నం చేశారు.

విశ్లేష‌ణ‌ :
కుంటుంబ కథా చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫన్ ఎలిమెంట్ కి మిస్ కాకుండా చూకుంటున్న అనిల్, ఈసారి ఏకంగా కామెడీ కథనే ఎంచుకోవడంతో మరింత నవ్వించే ప్రయత్నం చేశాడు. కథలో కొత్తదనం లేకపోయినా, మంచి ఆర్టిస్టులు పడడంతో వారి కామెడీ టైమింగ్ తో కథనం బాగా నడిపించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా రాసుకున్న అనిల్ రావిపూడి, ప్రతి సీన్ లో నవ్విస్తాడు కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం కొంత నిరాశపరిచాడు. క్లైమాక్స్‌లో నాజర్‌ ఎంట్రీ, ఆయన చెప్పే డైలాగ్స్‌ తో క్లైమాక్స్ కి కావాల్సిన లీడ్ తీసుకున్న అనీల్ రావిపూడి, ఎఫ్ 2 సినిమాకి మంచి ఎండింగ్ ఇచ్చినట్లే ఇచ్చి ఎఫ్ 3 కూడా ఉంటుందని కన్ఫార్మ్ చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన పాటల్లో ఒకటి రెండు తప్ప మిగిలినవి పెద్దగా ఆకట్టుకోలేదు, బీజీఎమ్ కూడా ఆహా ఓహో అనే స్థాయిలో లేదు. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది, ఫారిన్ లో తెరకెక్కించారు కాబట్టి సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది.

ఫైనల్ వర్డిక్ట్:
సంక్రాంతి బరిలో ఎన్ని పెద్ద సినిమాలు ఉన్న ధైర్యంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించడంలో సక్సస్ అవుతుంది

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Leave a Comment