Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్.. ఆ తర్వాత హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ తన పేరును మార్చుకున్నాడు. అవును, సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈయన.. తన ట్విట్టర్ ఖాతాలో విజయ్ దేవరకొండను కాస్త విజయ్ దేవరకొండ తుఫాన్ గా మార్చాడు. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు విజయ్ తన ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ పక్కన తుఫాన్ అనే పదాన్ని ఎందుకు యాడ్ చేశాడో తెలీక అయోమయంలో పడిపోయారు.
అయితే దీని వెనక ఓ కారణం ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా థమ్సప్ కూల్ డ్రింక్‌కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే . కానీ, ఇప్పుడు ఆయన చేతిలోంచి ఆ బ్రాండ్‌ను విజయ్ తీసేసుకున్నాడు. సదరు బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగానే `ఇది సాఫ్ట్ డ్రింక్ కాదు.. తుఫాన్` అంటూ విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఫోటో విడుదల చేశారు.
ఇక ఇప్పుడు సదరు కూల్ డ్రింక్ ప్రమోషన్ కోసమే ఆ తుఫాన్ ట్యాగ్‌ను విజయ్ తన ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ పక్కన యాడ్ చేశాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ, గత పదేళ్ల నుంచి మహేష్ ప్రమోట్ చేసే కూల్ డ్రింక్ బ్రాండ్‌ను విజయ్ లాగేసుకోవడంతో ఆయన అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!