Samantha: సమంత – నాగ చైతన్య విడాకుల వ్యవహారం తంతు జరిగి దాదాపు 3 నెలలు కావస్తుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ మేటర్ ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గతేడాది అక్టోబర్ 2న వారిరువురు విడాకులు తీసుకుంటున్నట్లు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరి గురించి నిత్యం ఏదో ఒక చర్చ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా చై-సామ్ విడాకులకు సంబంధించి నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Samantha: నాగార్జున మొదటినుండి చెబుతున్నది ఇదే..
తాజాగా ఓ మీడియా వేదికగా నాగార్జున ఇలా మాట్లాడారు. ముందుగా విడాకులు సమంతే అడిగిందని, చై ఆమె నిర్ణయాన్ని గౌరవించి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా నాగ్ మళ్ళీ ఈ విషయంపైన స్పందించారు. అది పూర్తిగా తప్పుడు సమాచారం అని కొట్టిపారేశారు. ‘సమంత, నాగ చైతన్య విడాకులకు సంబంధించి నేను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తి అబద్దం. దయచేసి పుకార్లను ఎవ్వరు నమ్మవద్దు.” అని ట్వీట్ చేశారు.
Marriage: పెళ్ళికి ముందు ఏ టెస్ట్ చేయించినా చేయించకపోయినా అమ్మాయి కి ఈ టెస్ట్ చేయించండి !
సమంత అభిమానుల రియాక్షన్ ఇదే..
ఇకపోతే సదరు ట్వీట్ గమనించిన సామ్ అభిమానులు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. వారి రియాక్షన్ ఈ విధంగా వుంది. ‘ఈరోజు ఇలా మాట్లాడిన నువ్వు ఆరోజు ఎక్కడ ఎటు పోయవయ్యా!’ అని ఒకరు, ‘ఇపుడు బాధపడి లాభం లేదు.. సామ్ ని మీరు చేజేతులా మిస్ చేసుకున్నారు.!’ అని మరొకరు, ‘సామ్ లాంటి అమ్మాయి దొరకాలంటే అదృష్టం ఉండాలి. అది మీకు కలిగింది. కానీ ఉపయోగించుకోలేకపోయారు!’ అని ఒకొకరు ఇలా.. నాగార్జునకి ఫుల్ గా కౌంటర్లు ఇస్తున్నారు.