NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP RRR: అనర్హత అంశంపై రఘురామ క్లారిటీ ఇదీ..

MP RRR: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభలో ఆ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ శుక్రవారం లోక్ సభ స్పీకర్ ఓం బిల్లాకు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలోనే వైసీపీ పార్లమెంట్ సభ్యులు ఇదే అంశంపై స్పీకర్ కు ఫిర్యాదు అందజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామ కృష్ణంరాజు పై రాజ్యాంగంలోని 10వ షెడ్యుల్ ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే దీనిపై స్పీకర్ ఓం బిల్లా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరో సారి స్పీకర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. దీనిపై రఘురామ కృష్ణం రాజు స్పందించారు.

 MP RRR comments on margani Bharath complaint
MP RRR comments on margani Bharath complaint

తాను ఏ పార్టీతో జతకట్టలేదనీ, అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లోపాలను మాత్రమే ప్రస్తావించాననీ, తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని అన్నారు.

Read More: MP RRR letter to CM YS Jagan: రఘురామ లేఖాస్త్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయో..? వరుసగా మూడో రోజు సీఎం జగన్ కు లేఖ..!!

రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే అధారాలు సమర్పించామని వైసీపీ పేర్కొంటుండగా, రఘురామ మాత్రం తనపై అనర్హత వేటు వేయడం కుదరని చెబుతున్నారు. అనర్హత వేటు పై ఇప్పటికే నాలుగైదు సార్లు ఫిర్యాదు చేసినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదన్నారు.

కాగా ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా ఏపిలో టీడీపీ నుండి గెలిచి వైసీపీలోకి అనధికారికంగా వెళ్లిన ఎమ్మెల్యేల విషయం చర్చకు వస్తున్నది. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అక్కడ రఘురామ కృష్ణం రాజు పై చర్యలు తీసుకుంటే ఇక్కడ కూడా స్పీకర్ ఈ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కదా అని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి, ఇక్కడి స్పీకర్ లు అనర్హత పిటిషన్ లపై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N