మెగా హీరో సినిమా నుంచి ఆ హీరోయిన్ ఔట్ ..?

మెగా మెనల్లుడు సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలతో వరసగా హిట్స్ అందుకొని మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ హిట్ అందుకోవాలన్న తపనతో ఏరికోరి “సోలో బ్రతుకే సో బెటర్” అన్న సినిమాలో నటించాడు. యంగ్ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nivetha Pethuraj: I'm Happy That Audiences Are Comparing Tik Tik Tik To  Hollywood Films

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్.. సాంగ్స్ తో అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కాగా మావయ్య పవన్ కళ్యాణ్ మాదిరిగానే సాయి ధరమ్ తేజ్ కూడా వరసగా సినిమాలని కమిటయ్యాడు. ప్రస్తుతం’ప్రస్థానం’ ఫేం దేవా కట్టా దర్శకత్వంలో చేస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతుండగా.. జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు నిర్మించనున్నారు.

Aishwarya Rajesh Shuts Down Marriage Rumour With Humour! | Varnam MY

అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జంటగా నటించే హీరోయిన్ విషయంలో మార్పులు జరిగాయని తాజా సమాచారం. ముందు ఈ సినిమాలో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు. కాగా ఇప్పుడు ఆ హీరోయిన్ స్థానంలో ఐశ్వర్య రాజేష్ వచ్చి చేరినట్టు సమాచారం. కాగా ఈ సినిమాకి ‘రిపబ్లిక్’ అన్న టైటిల్ పరిశీలనలో ఉండగా రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనుందట.