NTR: ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో సినిమా సెట్స్ మీదకి వచ్చేది ఎప్పుడంటే..!

Share

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించాడు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 14 భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ – హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంచనాలు ఊహించనివి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీద ఉన్న అంచనాలు అందుకోవడానికి దర్శకుడు, ఇద్దరు హీరోలు ముంబై, బెంగుళూరు, చెన్నైలలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు.

ntr-koratala siva combo movie going to start soon

ఇక ఈ సినిమా తర్వాత చరణ్ రెండు ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో గౌతమ్ తిన్ననూరి సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కొరటాల శివ దర్శకతంలో తెరకెక్కనున్న సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉండగా కరోనా వేవ్స్ కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. దాంతో కొరటాల సినిమా కూడా ఆలస్యం అయింది. ఎట్టకేలకి ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభించబోతున్నారు.

NTR: వీరి కాంబినేషన్‌లో మూవీ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

యువ సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కొరటాల శివ ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు. గతంలో ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఇంతక ముందు జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చి భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. దాంతో ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మూవీ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇందులో పెళ్ళి సందడి హీరోయిన్ శ్రీలీల ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ రూపొందిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

31 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago